Pooja Hegde: పక్కనే ఫుల్ బాటిల్.. పెగ్గు కలుపుతూ చిందులు వేసిన బుట్టబొమ్మ
టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న పూజా హెగ్డే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. మెల్లగా ఫాలోవర్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇటీవల అయితే ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. పక్కనే ఫుల్ బాటిల్ పెట్టుకొని మైమరచిపోయి చిందులు కూడా వేసింది. అలాగే పెగ్గు ఎంత స్టైల్ గా కలుపుతారో కూడా తనదైన శైలిలో ప్రజెంట్ చేసింది.

ఆ సినిమా నుంచి..
పూజా హెగ్డే కెరీర్ మొదట్లో వరుస అపజయాలను ఎదుర్కొంది. ఆరంభంలో బ్యూటిఫుల్ యాడ్స్ లో నటించిన పూజా చాలా ఈజీ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంతుందని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడికి మొదట్లోనే వరుసగా అపజయాలు రావడంతో మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బికినీలో దర్శనం ఇచ్చిందో అప్పటినుంచి ఆమె ఒక్కసారిగా మారిపోయింది. మంచి సినిమాలు రావడం కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

కెమెరాలన్ని కూడా ఆమె వైపే..
గ్లామర్ ప్రజెంటేషన్ లో అయితే పూజా హెగ్డే ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటోంది. ఎలాంటి డ్రెస్ లో కనిపించిన కూడా కెమెరాలన్ని కూడా ఈ బ్యూటీ వైపే తిరుగుతున్నాయి. వీలైనంత వరకు హాట్ నెస్ డోస్ పెంచుతోంది. ఇటీవల కాలంలో అయితే ఎక్కువగా బికినీలలో దర్శనమిస్తోంది. ఎక్కడ హాలిడే ట్రిప్ కు వెళ్లినా కూడా ఘాటైన బికినీ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

భారీగా ఫాలోవర్స్
ఇక పూజా హెగ్డే ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయింది అనే చెప్పాలి. ఈ బ్యూటీకి ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం 16.1 మిలియన్ల ఫాలోవర్స్ సంఖ్య ను కలిగి ఉంది. ఎలాంటి పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. పలు రకాల బ్రాండ్ లకు సైతం ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది. అందుకు పూజకు భారీగా ఆదాయం కూడా లభిస్తోంది. కేవలం ఇన్స్టాగ్రామ్ కోసమే పూజా హెగ్డే ప్రత్యేకంగా నలుగురి అసిస్టెంట్లను ఏర్పాటు చేసుకుంది. మేకప్ నుంచి డ్రెస్ స్టైలింగ్ వరకు అందరూ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారు.
Recommended Video
పక్కనే ఫుల్ బాటిల్
అయితే ఇటీవల పూజా హెగ్డే ఒక మద్యపాన కంపెనీకి ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించిన వీడియో వైరల్ అయ్యింది. ప్రముఖ బ్రాండ్ అయినటువంటి ఆల్కహాల్ కంపెనీ ఫుల్ బాటిల్ ను పక్కన పెట్టుకున్న పూజ, అలాగే పెగ్గు ఎలా కలుపుకోవాలో కూడా వివరంగా తెలియజేసింది. ఇక ఆ కంపెనీ ప్రచారం చేస్తున్న ఒక చాలెంజ్ గురించి కూడా పుట్ట బొమ్మ ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. కేవలం పూజా హెగ్డే మాత్రమే కాకుండా ఇటీవల చాలామంది హీరోయిన్స్ ఈ తరహాలోనే సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











