Pooja Hegde: టెన్నిస్ పాపగా మారిన బుట్టబొమ్మ... అతని కోసమే అంటూ పోస్ట్
బుట్టబొమ్మ పూజా హెగ్డే... తెలుగులో సినిమాలు లేకపోయినా.. మాల్దీవ్స్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. బర్త్ డేని అక్కడే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. రోజుకో ఫోటోషూట్ పెడుతూ.. కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. తాజాగా టెన్నిస్ పాప అవతారం ఎత్తిన ఈ బ్యూటీ... టెన్నిస్ కోర్టులో పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొట్టింది. అంతే కాదు.. ఈ ఫోటోలు అతని కోసమే అంటూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
పూజా హెగ్డే... ముంబయిలో సెటిల్ అయిన కర్ణాటక దంపతులకు జన్మించింది. ఇక పూజా హెగ్డే చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకోవడంతో... మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి... ప్రేక్షకులను, యూత్ ను ఆకట్టుకుంది. ఇక వరుస సినిమాల ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈ భామ.

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వాళ్లలో పూజా హెగ్డే ఒకరని ఇట్టే చెప్పేయొచ్చు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ... తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి (తెలుగులో మాస్క్) మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ భామ. ఇక ఆ తర్వాత తెలుగులో ఒకలైలా కోసం అనే సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక స్టార్ హీరోల సరసన యాక్ట్ చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది.

గుంటూరు కారం సినిమాలో నటించాల్సి ఉండగా.. ఏమైందో తెలియదు కానీ ఈ భామ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి తెలుగులో ఈ భామకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. అక్కడ సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇక ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనట్టే ఉన్నాయి. సాయిధరమ్ తేజ్, సంపత్ నందీ కాంబోలో రాబోతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని అంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఇటీవల పూజా తన బర్తే డే సెలెబ్రేషన్స్ కోసం మల్దీవ్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ చెక్కేసిన ఈ భామ.. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న బుట్ట బొమ్మ... అక్కడే ఉంటూ బీచ్ ల్లో అందాలు ఆరబోస్తూ.. రోజుకో ఫోటోషూట్ సోషల్ మీడియాలో వదులుతోంది. తన ఘాటు అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తూ.. మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ.
తాజాగా మాల్దీవ్స్ లో ఈ భామ టెన్నిస్ కోర్ట్ లో టెన్నిస్ గేమ్ డ్రెస్ వేసుకొని కనిపించింది. అంతేనా స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకుని.. బ్యాట్ పట్టుకుని ఆడుతున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక థై షోతో పాటు.. తన ఎద అందాలు కనిపించేలా.. ఫోటోషూట్ చేసింది. ఇక ఈ ఫోటోషూట్ ను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ... ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది నీ కోసం ఫెదరర్ అంటూ రాసుకువచ్చింది.
టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతని కోసం పూజా హెగ్డే ఫోటో షూట్ చేసి.. ఫోటోలు ఫోస్ట్ చేసింది. అయితే ఫూజా ఫెదరర్ ఫ్యాన్ అయి.. ఇలా చేసి ఉండొచ్చని నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి పూజా టెన్సిస్ డ్రెస్ లో అదిరిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











