నీ బాడీపై అవి ఉన్నాయా? నెటిజన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే జవాబు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకున్నారు. కానీ, కొందరు మాత్రం అందం, అభినయం ఉన్నా ఎందుకనో సక్సెస్ కావడం లేదు. అలాంటి వారిలో ఫేమస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. టాలీవుడ్‌లో చాలా కాలం పాటు సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయింది. అయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూనమ్ దిమ్మతిరిగే ఫొటోతో షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసమే!

ఆ సినిమాలతో ఫేమస్:మోడలింగ్ రంగంలో పాపులర్ అయిన పూనమ్ బజ్వా.. తెలుగులోకి 'మొదటి సినిమా' అనే చిత్రంతో వచ్చింది. ఆ తర్వాత 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లో నటించి అలరించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లు మాత్రం దక్కలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు విరామం తీసుకుంది. ఆ తర్వాత వేరే భాషల్లో కంటిన్యూ అయింది.

Heroine Poonam Bajwa Shares Stunning Photo for Netizen

ఇప్పుడు అవే చేస్తోంది:పూనమ్ బజ్వా ఆరంభంలో వచ్చినట్లుగా ఆఫర్లను సొంతం చేసుకోవట్లేదు. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ నటించింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు రెడీ అయిపోతోంది. తెలుగులోకి కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది.

ప్రేమ పెళ్లికి రెడీగానే:హీరోయిన్‌గా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయినా పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా తెలిపింది. అంతేకాదు, అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పుడు 38 సంవత్సరాలు వచ్చినా పూనమ్ బజ్వా మాత్రం ఇంకా పెళ్లి ఊసు ఎత్తడం లేదు.

Heroine Poonam Bajwa Shares Stunning Photo for Netizen

సోషల్ మీడియాతోనే:కొంత కాలంగా పెద్దగా ఆఫర్లు రాకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వెళ్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంటోంది. ఇలా తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

నీ బాడీపై ఉన్నాయా:తాజాగా హీరోయిన్ పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ASK ME సెషన్ నిర్వహించింది. ఇందులో నెటిజన్లు అడిగిన ఎన్నో రకాల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ పూనమ్ బజ్వాను 'నీ బాడీపై ఏమైనా సాగిన మచ్చలు లేదా గీతలు (Stretch Marks) ఉన్నాయా' అని అడిగాడు.

Heroine Poonam Bajwa Shares Stunning Photo for Netizen

ఆ ఫొటోతో షాకిచ్చేలా:సదరు నెటిజన్ తన బాడీ గురించి అడిగిన ప్రశ్నకు హీరోయిన్ పూనమ్ బజ్వా ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. ఇందుకోసం చిన్న షార్ట్, లోదుస్తులు ధరించిన ఫొటోను షేర్ చేసి తనకు ఎలాంటి సాగిన మచ్చలు లేదా గీతలు (Stretch Marks) లేవని చెప్పింది. అయితే, కొన్ని భాగాల్లో ఫ్యాట్ మాత్రం ఉందని హీరోయిన్ పూనమ్ బజ్వా వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X