నీ న్యూడ్ వీడియో రిలీజ్ చేస్తాం.. కడప కీలక నేత బెదిరింపు.. పూనమ్ కౌర్ సంచలనం
వైసీపీ నేతలు ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన కీలక నేతపై తెలుగు సినిమా హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. గత కొద్దికాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గురూజీ అనే ప్రముఖుడిపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ఆమె ప్రస్తుతం ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వర్గం, కీలక నేతపై భయంకరమైన విషయాలను బయటపెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు పూనమ్ కౌర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఏపీలోని రాజకీయ పార్టీకి చెందిన నేతలు దారుణంగా వేధించారు. అలాగే నటుడు, ఆ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగిన నటుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల వల్ల నా వివాహం రద్దైంది అని చెప్పారు. పూనమ్ కౌర్ చెప్పిన సంచలన విషయాల్లోకి వెళితే..
ఓ రోజు కడప నుంచి కొందరు వచ్చారు. మేము కడప నుంచి వచ్చామని చెప్పారు. వాళ్లు వచ్చిన అలా మాట్లాడటంతో నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అయితే ఎందుకు వచ్చారని అడిగితే.. చాలా దారుణమైన విషయాలు మాట్లాడారు. ఓ స్టార్ హీరోపై మీరు అభండాలు, విమర్శలు, ఆరోపణలు చేయాలి. అందుకు మీరు అడిగినంత డబ్బు ఇస్తాం. ప్రభుత్వంలో పదవి ఇచ్చి హోదా కల్పిస్తాం అని చెప్పారు. అయితే నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చాలా నీచంగా బెదిరించారు. ఆ సమయంలో నేను దేవుడిపైనే భారం వేశాను అని పూనమ్ కౌర్ చెప్పారు.

అయితే కడప నేత చేసిన బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. కేవలం నా ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే చెప్పాను. ఒకవేళ యాక్టర్‌కు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఆరోపణలు చేయకపోతే.. నీ న్యూడ్ వీడియోలు మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం అని బెదిరించారు. అయినా నేను ఏనాడు ఆ యాక్టర్ గురించి తప్పుగా మాట్లాడలేదు అని పూనమ్ కౌర్ తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను సంచలన రీతిలో బయటపెట్టారు. గురూజీ కూడా నా జీవితాన్ని నాశనం చేశాడు. అలాగే పోసాని కృష్ణ మురళీ ప్రెస్ మీట్ పెట్టి నా గురించి చెప్పిన తర్వాత.. నా పెళ్లి ఆగిపోయింది. ఆయన నా పేరు బయటకు తీయకుండా ఉంటే.. నాకు వివాహం జరిగి నా జీవితం బాగుండేదేమో అని బాధపడ్డారు. నా జీవితంలో ఎంత దారుణాలు జరుగాలో అవన్నీ నా కళ్లారా చూశాను అని ఆమె అన్నారు.
పూనమ్ కౌర్ తాజా ఇంటర్వ్యూ రాజకీయ, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఆమె చెప్పిన విషయాలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు, వైఎస్ జగన్ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారా? రాజకీయ లబ్ది కోసం, పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు పోసాని మురళీ ఓ అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టారా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పూనమ్ కౌర్ అనుభవించిన బాధలపై నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











