Poonam Kaur: "బట్టలు కూడా వేస్కోరాదు.. రెండేళ్లుగా ఆ వ్యాధితో నరకం చూస్తున్నా"
పూనమ్ కౌర్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో దూసుకుపోయే ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళంలో కూడా అనేక సినిమాలు చేసింది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పింది. తాను ఓ ఆరోగ్య సమస్యతో గత రెండేళ్లుగా బాధ పడుతున్నట్లు వివరించింది. వ్యాధితో బాధ పడుతున్న సమయంలో కనీసం బట్టలు కూడా వేసుకోరాక నానా అవస్థలు పడ్డట్లు వివరించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
2006లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది క్యూట్ బ్యూటీ పూనమ్ కౌర్. ఆ తర్వాత నుంచి వరసుగా సినిమాల్లో అవకాశాలు దక్కంచుకుంటూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లో సందడి చేసింది. కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ ను గెలుచుచుకుంది.

ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ వీడియోను షేరే చేసింది. అందులో తాను ఓషోలో పాల్గొని తన ఆరోగ్య సమస్యల గురించి వివరించింది. తొలిసారి ఆమె రెండేళ్ల పాటు అనుభవించిన నరకం గురించి వివరించింది.
జీ తెలుగు ఛానెల్ లో వచ్చే ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో పాల్గొన్న పూనమ్ కౌర్.. మంతెన సత్యనారాయణ రావు గారితో మాట్లాడుతూ.. తన ఆరోగ్య సమస్య గురించి వెల్లడించింది. రెండేళ్లుగా తాను ఫైబ్రోమైయాల్జియా అనే సమస్యతో భాధ పడుతున్నట్లు వివరించింది. ఈ సమస్య వల్ల కాళ్లు, చేతులు కదపలేక నానా అవస్థలు పడ్డానని తెలిపింది. ముఖ్యంగా వ్యాధి ఉన్నంత కాలం.. బట్టలు కూడా వేసుకోరాక చాలా బాధలు అనుభవించినట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో టైట్ బట్టలు కూడా వేసుకోలేకపోయానని.. చాలా వదులుగా ఉండే బట్టలు మాత్రమే వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

ఆ సమయంలోనే తాను నేచురోపతి లెజెండ్ డా.మంతెనగారిని కలవడం వల్ల తన సమస్య తీరిందని చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనల వల్లే తాను ఆ సమస్య నుంచి బయట పడగలిగానని పూనమ్ కౌర్ పేర్కంది. మంచి మనసుగల వ్యక్తితో ఇలాంటి ఓషోలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం అంటూ చెప్పుకువచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ షోను చూసేయండి.


Click it and Unblock the Notifications











