మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా?.. నిర్మాతపై మండి పడ్డ పూనమ్
పూనమ్ కౌర్ (Poonam Kaur).. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని అమ్మడు. పునమ్ కౌర్ .. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో పలు చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే.. ఈ అమ్మడు తన సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్. తరుచు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ షాకింగ్ కామెంట్స్ ఎవర్నీ ఉద్దేశించి చేస్తోందో ఓ లూక్కేయండి.
పూనమ్ కౌర్ తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్నది. ఈ ఫేమ్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇలా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన మాయాజాలం అనే సినిమాతో తొలిసారి వెండితెర పై కనిపించింది. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఆకట్టుకుని, వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించింది. మరోవైపు.. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

పూనమ్ కౌర్ చేసిందే తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ షోతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టింగ్ గా ఉండే హీరోయిన్ పూనమ్ కౌర్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే.. పరోక్షంగా కౌంటర్లు వేస్తుంది. ఎవర్ని ఉద్దేశించి ఆ పోస్టులు చేస్తోంది చెప్పడం కొంచెం కష్టమే. ఇలా ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. తాజా మరో షాకింగ్ కామెంట్స్ చేసింది పూనమ్ కౌర్.
ఇంతకీ ఏమైందంటే.. ప్రముఖ నిర్మాత చిట్టి బాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. కానీ, ఇంత వరకు వచ్చి ఆఫీస్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదని, ఆఫీస్‌కు ఎన్ని సార్లు రమ్మని పిలిచినా రాలేదని, కంప్లైంట్ రాసి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు చిట్టిబాబు. ట్విట్టర్‌లో ఎప్పుడో ఒకసారి పిచ్చిగా ట్వీట్లు వేస్తుంటుందని, ఫిర్యాదు మాత్రం ఇవ్వడం లేదని, అసలేం జరిగిందో చెప్పడం లేదంటూ కామెంట్స్ చేశాడు. చిట్టి బాబు వ్యాఖ్యలపై హీరోయిన్ పూనమ్ కౌర్ మండి పడింది.

ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ట్విట్ చేస్తూ.. ' మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు. నేను మీలా బూటకపు మాటలు చెప్పేదాని కాదు.మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నాపై కామెంట్స్ చేయడం కాదు. దర్శకుడిని ప్రశ్నించే ధైర్యం నాకు ఉంది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా?' అని నిలదీసింది. అమ్మాయిలదే తప్పు అన్నట్టుగా ఈ మనిషి చెప్పడం దారుణం అని పూనమ్ కౌర్ రియాక్ట్ అయింది. మరి ఈ వ్యాఖ్యలపై నిర్మాత చిట్టి బాబు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదెలా ఉంటే.. పూనమ్ కౌర్ ను అన్యాయం జరిగితే.. ఇంత వరకు బయటకు వచ్చి తనకు జరిగిన విషయాన్ని ఎందుకు క్లియర్ గా చెప్పలేకపోతుందనే మిలియన్ డాలర్ క్వశ్చన్.


Click it and Unblock the Notifications











