ప్రెగ్నెన్సీ అని పెళ్లి చెడగొట్టారు..చచ్చే లోపు ఆయన్ను.. పూనమ్ కౌర్
Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఈ అమ్మడు తన సినిమాల కంటే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వివాదాలకు తెర తీసుకుంటుంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ నే కాకుండా బడా హీరోలను కూడా టార్గెట్ చేసి కాంట్రావర్సీ క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ షాకింగ్ కామెంట్స్ ఎవర్నీ ఉద్దేశించి చేస్తోందో తెలుసకోండీ.
పూనమ్ కౌర్ పంజాబీ భామ తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్నది పూనమ్. ఈ తరుణంలో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మాయాజాలం మూవీతో నటించి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు తన అందం, అభినయంతో మెప్పించింది. వరుసగా అవకాశాలు తగ్గించుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించింది. అలాగే..తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ షోతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టింగ్ గా ఉండే హీరోయిన్ పూనమ్ కౌర్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. అలాగే.. ఆమె పరోక్షంగా కౌంటర్లు వేస్తుంటుంది. ఎవర్ని ఉద్దేశించి ఆ పోస్టు పెట్టిందో కచ్చితంగా చెప్పలేం. ఇలా ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. సంచలన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్.
హీరోయిన్ పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని అవకాశం చిక్కినప్పుడల్లా హీరో పవన్ కల్యాణ్ ను, దర్శకుడు త్రివిక్రమ్‌లపై తన అక్కస్సును వెల్లాబుచ్చుతుంది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తాను ఇచ్చిన కంప్లయిట్‌ను తీసుకున్నారా? అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను ప్రశ్నించింది. తన లాంటి వాళ్లకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు. అందుకే తననీ సైలెంట్‌గా పక్కనబేట్టేశారనీ, తాను అప్పుడు మా అసోసియేషన్‌లో ఉన్న పెద్దవాళ్లకి కంప్లయింట్ చేశాననీ, ఇప్పుడైన ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని కోరుతున్నాను అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. పూనమ్ కౌర్ చేసిన షాకింగ్ కామెంట్స్ ను సంబంధించిన ఓ పాత ఇంటర్య్వూ నెట్టింట్టో తెగ వైరలవుతోంది. ఇండస్ట్రీలో మిమ్మల్నీ ఇబ్బంది పెట్టారనే వార్తలొస్తున్నాయి వాటిపై మీ స్పందనేంటీ అని హీరోయిన్ పూనమ్ కౌర్ ను ప్రశ్నించగా.. 'సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతా.. నేను ప్రెగ్నెంట్ అయి.. అబాషన్ అయిందనీ, నాకు డబ్బులు ఇచ్చారని ఎన్నో రకాల నాపై దుశ్ప్రచారం చేశారు. నాకు పెళ్లి అయ్యే టైం లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దాదాపు రెండు సంవత్సరాలు నన్ను సతాయించి సతాయించి చావు దాక తీసుకెళ్లారు. కొంత మంది నువ్వు చంపిపోతే.. ఒక వన్డే న్యూస్ ఉంటావ్ అని కామెంట్స్ చేశారు. ఆ మాటకి నేను చచ్చే వరకు ఆ మనిషి నన్ను చూడాలని నేను బ్రతుకుతున్న' షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ కామెంట్స్ ఎవర్నీ ఉద్దేశించి చేసిందో మాత్రం క్లారీటి ఇవ్వలేదు పూనమ కౌర్.


Click it and Unblock the Notifications











