twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Poorna Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. వాళ్లిద్దరితో కలిసి ప్రకటన.. ఆ వీడియో వైరల్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం. టాలీవుడ్‌లో చాలా కాలంగా సినిమాలు చేస్తూ.. బుల్లితెరపై షోలలో కనిపిస్తూ హవాను చూపిస్తోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే దుబాయ్‌కు చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుంది. అయినా కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ పూర్ణ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్‌ను చెప్పింది. వివరాల్లోకి వెళ్తే...

    అలా ఎంట్రీ.. ఫుల్ పాపులర్

    అలా ఎంట్రీ.. ఫుల్ పాపులర్

    మలయాళ భామ 'శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే 'సీమటపాకాయ్', 'సిల్లీ ఫెలోస్', 'అదుగో', 'రాజుగారి గది', 'మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాలతో ఫుల్ పాపులర్ అయిపోయింది.

    Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తొలగింపు.. కోర్టు తీర్పుతో వాళ్లకు షాక్.. రికార్డులపై తీవ్ర ప్రభావంUnstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తొలగింపు.. కోర్టు తీర్పుతో వాళ్లకు షాక్.. రికార్డులపై తీవ్ర ప్రభావం

    దుబాయ్ షేక్‌తో పూర్ణ పెళ్లి

    దుబాయ్ షేక్‌తో పూర్ణ పెళ్లి

    వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే హీరోయిన్ పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన తర్వాత వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో అరబిక్ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.

    పెళ్లి తర్వాతా కంటిన్యూగా

    పెళ్లి తర్వాతా కంటిన్యూగా

    దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ పూర్ణ చాలా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. అదే సమయంలో తన కెరీర్‌ను ముందుకు సాగిస్తానని కూడా పరోక్షంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆమె షూట్‌లలో కూడా పాల్గొనబోతుంది. ఇక, ఇప్పుడు పూర్ణ.. నాని 'దసరా' మూవీలో విలన్‌గా నటిస్తోంది.

    మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శనమళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

    తల్లి కాబోతున్న హీరోయిన్

    హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం తాజాగా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు యూట్యూబ్‌లో ఓ వీడియోను కూడా షేర్ చేసింది. అందులో తాను 'అమ్మను అవుతున్నాను' అంటూ వెల్లడించింది. అంతేకాదు, ఇందులో తన పక్కన తల్లిదండ్రులను ఉంచుకుని వీళ్లిద్దరూ అమ్మమ్మ, తాతయ్య అవుతున్నారు అని కూడా చెప్పింది.

    పూర్ణకు శుభాకాంక్షల వెల్లువ

    పూర్ణకు శుభాకాంక్షల వెల్లువ

    హీరోయిన్ పూర్ణ తల్లి కాబోతుందంటూ ప్రకటించిన వెంటనే ఆమెకు సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఈ హీరోయిన్ చేసిన వీడియోకు కామెంట్ల రూపంలో విషెస్ తెలియజేశారు. దీంతో పూర్ణ ప్రెగ్నెన్సీ న్యూస్ హైలైట్ అవుతోంది. ఫలితంగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతోంది.

    Neha Shetty: షర్ట్ విప్పేసి రచ్చ చేసిన హీరోయిన్.. టెంప్ట్ చేస్తున్నవా రాధికా?Neha Shetty: షర్ట్ విప్పేసి రచ్చ చేసిన హీరోయిన్.. టెంప్ట్ చేస్తున్నవా రాధికా?

    అందరికీ థ్యాంక్స్ అంటూ

    అందరికీ థ్యాంక్స్ అంటూ

    తన కెరీర్ ఆరంభం నుంచి అండగా ఉంటోన్న అభిమానులకు తాజాగా హీరోయిన్ పూర్ణ షేర్ చేసిన వీడియోలో థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు, పెళ్లైన సమయం నుంచి తన జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని కూడా ఆమె వెల్లడించింది. అలాగే, తన భర్త షానిద్ గురించి కూడా హీరోయిన్ పూర్ణ మనసు విప్పి మాట్లాడింది. అలాగే, ఫ్యామిలీతో సంబరాలు చేసుకుంది.

    English summary
    Actress Poorna Gets Married To Her Boyfriend Shanid asifali Recently. Now She Announces Pregnancy News Via Youtube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X