అవును’ హీరోయిన్‌కు బెదిరింపులు.. పూర్ణను ఖతం చేస్తామని బ్లాక్‌మెయిల్

తెలుగు, తమిళ, మలయాళ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసింకు ఎదురైన వేధింపులు, బ్లాక్ మెయిల్ వ్యవహారం మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. కొందరు అకతాయిలు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు లాగేందుకు ప్రయత్నించడంతో కుటుంబం అప్రమత్తమైంది. వెంటనే ఫిర్యాదు చేసి అకతాయిలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. షామ్నా ఖాసిం కెరీర్ గురించి, ఆమెకు ఎదురైన వ్యవహారంలో ఏం జరిగిందని తెలుసుకొందాం..

తెలుగులో హీరోయిన్‌గా

తెలుగులో హీరోయిన్‌గా

తెలుగులో శ్రీ మహాలక్ష్మి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, సువర్ణ సుందరి చిత్రాల్లో నటించారు. తాజాగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న తలైవి చిత్రంలో శశికళ పాత్రలో కనిపిస్తున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు.

ఢీ తెలుగు షోలో న్యాయమూర్తిగా

ఢీ తెలుగు షోలో న్యాయమూర్తిగా

కేవలం సినిమా రంగంలోనే కాకుండా టెలివిజన్‌ రంగంలో కూడా మంచి పాపులారిటీని సాధించారు. డాన్సర్‌గా తన కెరీర్ మొదలుపెట్టిన పూర్ణ సూపర్ డ్యాన్సర్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఢీ జోడి సీజన్ 11వ సీజన్‌, అలాగే ఢీ ఛాంపియన్స్ 12వ సీజన్లో న్యాయమూర్తిగా వ్యవహరించారు. టెలివిజన్‌లో పలు షోలో కనిపించారు. అంతే తమిళంలో కన్నమూచి అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

కొద్ది రోజులుగా వేధింపులు

కొద్ది రోజులుగా వేధింపులు

హీరోయిన్ పూర్ణకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులనుంచి బెదిరింపులు వస్తున్నాయి. మాకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే కెరీర్‌ను నాశనం చేస్తామని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఇలా వేధింపుల కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు సంయమనం పాటించారు. అకతాయిల వేధింపులు తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

తన కూతురు, యాక్టర్ పూర్ణను కొందరు వేధిస్తున్నారు. ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సొమ్ము ఇవ్వకపోతే అంతు చూస్తామని బెదిరించారు అని కేరళలోని మరదు పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసుల అకతాయిల ఫోన్లను టాప్ చేసి వారిని అరెస్ట్ చేశారు.

Recommended Video

Bandobast Movie Teaser
బ్లాక్ మెయిల్ వెనుక ఎవరైనా అనే కోణంలో

బ్లాక్ మెయిల్ వెనుక ఎవరైనా అనే కోణంలో

నటి పూర్ణకు ఎదురైన వేధింపుల కేసులో అందిన ఫిర్యాదు ప్రకారం వెంటనే స్పందించిన నలుగురిని అరెస్ట్ చేశాం. వారిని వెంటనే జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాం. వారి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నాం. అరెస్ట్ చేసిన వారిని శరత్, అశ్రఫ్, రఫీక్, రమేష్‌గా గుర్తించాం అని మరదు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X