For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రగ్స్ వల్ల షూటింగ్‌లో ఇబ్బంది పడ్డా.. ఆ నటుడి వల్లే అలవాటు: హీరోయిన్ పూర్ణ సంచలన వ్యాఖ్యలు

  |

  డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోయిన్‌గా స్థిరపడిపోయింది టాలెంటెడ్ యాక్ట్రెస్ పూర్ణ అలియాస్ సామ్నా కాసీం. మలయాళ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలు చేసింది. తద్వారా అక్కడ స్టార్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలో తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చి నటిగా మన్ననలు అందుకుంది. ఇక, ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించిందామె. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు ఓ యాక్టర్ డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి షాకిచ్చింది పూర్ణ. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  శ్రీ మహాలక్ష్మీతో ఎంటర్ అయిన బ్యూటీ

  శ్రీ మహాలక్ష్మీతో ఎంటర్ అయిన బ్యూటీ

  రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన ‘శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది పూర్ణ. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును', ‘అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే ‘సీమటపాకాయ్', ‘సిల్లీ ఫెలోస్', ‘అదుగో', ‘రాజుగారి గది', ‘మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాలు చేసింది.

   దక్షిణాదిలో దుమ్ము దులిపేసిన పూర్ణ

  దక్షిణాదిలో దుమ్ము దులిపేసిన పూర్ణ

  కేరళ రాష్ట్రానికి చెందిన పూర్ణ.. ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో కనిపించి మెప్పించింది. ఇలా దక్షిణాది మొత్తం తన హవాను చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో విజయాలను అందుకుంది. తద్వారా నటిగా పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

  భారీ చిత్రాల్లో భాగం అయిన హీరోయిన్

  భారీ చిత్రాల్లో భాగం అయిన హీరోయిన్

  కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తలైవి'. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంలో పూర్ణ.. శశికళ పాత్రను పోషిస్తోంది. అలాగే, బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా చిన్న సినిమాల్లోనూ కాకుండా భారీ ప్రాజెక్టుల్లోనూ భాగం అవుతూ సత్తా చాటుతోంది.

  బుల్లితెరపై అలా సందడి చేస్తోంది కూడా

  బుల్లితెరపై అలా సందడి చేస్తోంది కూడా

  వెండితెరపై అద్భుతమైన నటనతో తనదైన ముద్రను వేసుకున్న పూర్ణ.. బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇప్పటికే వేరే భాషల్లో పలు షోలలో పని చేసిన ఈ అమ్మడు.. తెలుగులో ‘ఢీ' అనే డ్యాన్స్ షోకు జడ్జ్‌గా చేస్తోంది. దాదాపు మూడు సీజన్లుగా ఇందులో కనిపిస్తోన్న ఆమె.. అద్భుతమైన జడ్జ్‌మెంట్‌తో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో కొన్ని రొమాంటిక్ యాక్టులతో ఫేమస్ అయింది.

   సెకెండ్ ఇన్నింగ్స్ అలా.. తొలిసారి అలా

  సెకెండ్ ఇన్నింగ్స్ అలా.. తొలిసారి అలా

  గతంలో పోలిస్తే ఇటీవలి కాలంలో పూర్ణకు పెద్దగా హీరోయిన్ ఆఫర్లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పవర్ ప్లే'లో ప్రతినాయకురాలిగా నటించింది. విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

  హీరోయిన్ పూర్ణ సంచలన వ్యాఖ్యలు

  హీరోయిన్ పూర్ణ సంచలన వ్యాఖ్యలు

  ‘పవర్ ప్లే' సినిమా కోసం కొద్ది రోజులుగా హీరోయిన్ పూర్ణ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సినిమా గురించిన ఎన్నో విషయాలను వెల్లడించింది. అదే సమయంలో తన పాత్రకు సంబంధించిన వివరాలు కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు, డ్రగ్స్ వాడడంపై ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది పూర్ణ.

  ఆ నటుడే నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు

  ఆ నటుడే నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు

  ఇంటర్వ్యూలో హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో డ్రగ్స్‌కు బానిసైన అమ్మాయిగా కనిపిస్తాను. అవి ఎలా వాడాలో నాకు తెలీదు. అందుకే ఓ సారి ముక్కుతో పీల్చుతుండగా లోపలికి వెళ్లిపోయి ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో స్పాట్‌లోనే ఉన్న ఒక నటుడు డ్రగ్స్ నాకు ఎలా వాడాలో నేర్పించాడు. అది నాకు చాలా ఉపయోగపడింది' అంటూ వివరించి షాకిచ్చిందామె.

  English summary
  Shamna Kasim, also known by the stage name Poorna, is an Indian film actress, Professional Dancer and model. She is also known for her work in the South Indian Film Industry. She started her career as a classical dancer and got into media when she was participating at the reality-based dance competition Super Dancer on Amrita TV.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X