అందాలను మొత్తం ఆరబోసిన ప్రగ్యా జైస్వాల్: గ్లామర్ షోలో బౌండరీలు దాటేసి.. మరీ ఈ రేంజ్‌లోనా!

తెలుగులో కొన్ని సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మహారాష్ట్ర చిన్నది ప్రగ్యా జైస్వాల్ ఒకరు. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, మర్చిపోలేని పాత్రలను పోషించింది. అయినప్పటికీ కెరీర్‌ను మాత్రం సక్రమంగా నడుపుకోలేకపోతోంది. ఇక, సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రగ్యా జైస్వాల్ అందాలను మొత్తం ఆరబోసేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్

అలా పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్


మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్రగ్యా జైస్వాల్.. 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు 'కంచె'తో రీలాంచ్ అయింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు మంచి పేరొచ్చింది.

విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు

విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు

'కంచె' చిత్రంతో ప్రగ్యా జైస్వాల్ ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ అమ్మడు నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ కారణంగానే సినిమాల వేగం తగ్గించేసింది. అయితే, ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

బాలయ్యకు జోడీగా... అలాంటి పాత్రలో

బాలయ్యకు జోడీగా... అలాంటి పాత్రలో

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండడం వల్లే ఈ సీనియర్ హీరో సినిమాలో నటిస్తుందట.

మరో సీనియర్ హీరో మూవీలో కీ రోల్

మరో సీనియర్ హీరో మూవీలో కీ రోల్

సుదీర్ఘ విరామం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు రూపొందిస్తోన్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ సీనియర్ హీరో శ్రీకాంత్‌కు జోడీగా నటిస్తుందని అంటున్నారు.

అందులో మాత్రం యమ రచ్చ చేస్తూనే

అందులో మాత్రం యమ రచ్చ చేస్తూనే

సినిమాల పరంగా బిజీగా ఉన్నా.. లేకున్నా.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో హల్‌చల్ చేస్తున్న భామ

గ్లామర్ షోతో హల్‌చల్ చేస్తున్న భామ

సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్రాళ్ల హృదయాలకు గాయాలు చేస్తోంది. ఇక, ఈ మధ్య ఘాటు ఫొటోలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న ఈ అమ్మడు.. తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Recommended Video

Kurushatram Trailer Launch Event | Darshan | Arjun Sarja | Naganna | Sonu Sood || Filmibeat Telugu
అందాలను మొత్తం ఆరబోసిన ప్రగ్యా

అందాలను మొత్తం ఆరబోసిన ప్రగ్యా

తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, బౌండరీలను దాటేసి మరీ ఈ ఫొటోలో ప్రగ్యా జైస్వాల్ క్లీవేజ్ షో చేసింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X