Akhanda తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు బంపర్ ఆఫర్.. బాలీవుడ్ సూపర్‌స్టార్‌తోనే ఏకంగా ఛాన్స్

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ప్రగ్యా జైస్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే అఖండ తర్వాత ఆ మార్క్‌ను తొలగించుకోవడమే కాకుండా దక్షిణాది, బాలీవుడ్‌లో భారీ ఆఫర్లను దక్కించుకొంటున్నది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్‌తో కలిసి నటించడంపై ప్రగ్యా జైస్వాల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..

తమిళం నుంచి టాలీవుడ్‌లోకి

తమిళం నుంచి టాలీవుడ్‌లోకి

ఉత్తరాది భామ అయినప్పటికీ ప్రగ్యా జైస్వాల్ తమిళ చిత్రంతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. విరాట్టు సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వత డేగా సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అనంతరం టిటూ ఎంబీఏ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

స్టార్ హీరోలతో నటించినా అదృష్టం కలిసి రాలేదు

స్టార్ హీరోలతో నటించినా అదృష్టం కలిసి రాలేదు

అయితే తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటురోడు, నక్షత్రం, జయజానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ.. ప్రగ్యా జైస్వాల్‌కు అదృష్టం కలిసి రాలేదు. కానీ అఖండ చిత్రంతో ప్రగ్యా జైస్వాల్ రాత మారే పరిస్థితి కనిపిస్తున్నది.

అఖండ తర్వాత సల్మాన్ ఖాన్‌తో

అఖండ తర్వాత సల్మాన్ ఖాన్‌తో


అఖండ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ కోసం ఓ పాటలో నటించింది. ఈ పాటను గురు రాంధ్వా, సల్మాన్ ఖాన్ ప్రేయసి లులియా వాంటూర్ పాడారు. మై ఛలా విత్ సల్మాన్ ఖాన్ అనే పాటలో నర్తించింది. ఈ పాట జనవరి 22న రిలీజ్ కానున్నది.

సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులు వేయడం గురించి

సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులు వేయడం గురించి

సల్మాన్ ఖాన్‌తో నటించడంపై ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. నేను చాలా నర్వెస్‌గా ఫీలయ్యాను. దేశంలోనే స్టార్ హీరో అయినత సల్మాన్ ఖాన్‌ సరసన స్టెప్పులేయాల్సి రావడంతో కాస్త కంగారు పడ్డాను. సల్మాన్ పక్కన అని చెప్పూగానే నన్ను నేను గిచ్చుకొన్నాను. సల్మాన్ ఖాన్‌తో రొమాంటిక్ పాటలో డ్యాన్స్ చేయడంతో నా జన్మధన్యమైంది.

అంతిమ్: ది ఫైనల్‌ సినిమా ప్రమోషన్ పాటలో

అంతిమ్: ది ఫైనల్‌ సినిమా ప్రమోషన్ పాటలో


అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ సినిమా కోసం సల్మాన్ ఖాన్‌తో చేసిన పాట గురించి ప్రగ్యా జైస్వాల్ వివరిస్తూ.. ఈ పాటలో కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌ చాలా రొమాంటిక్‌గా పాటలో కనిపిస్తాడు. స్టోరికి సంబంధం ఉండదు. కానీ పాటకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి పాటలో నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను అని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు.

Recommended Video

Akhanda Star Pragya Jaiswal In Kakinada | Mugdha Store Launch | Filmibeat Telugu
టీ సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్

టీ సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్

సల్మాన్ ఖాన్, ప్రగ్యా జైస్వాల్‌పై చిత్రీకరించే రొమాంటిక్ సాంగ్‌ను టీ సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మించారు. ఈ పాటకు షబీనా ఖాన్, డైరెక్టర్ గిఫ్టీ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ లవర్స్‌కు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉంటుందని అంటున్నారు. ఈ పాటను షబ్బీర్ ఆహ్మాద్ రాశారు. ఈ పాటను టీ సీరీస్‌ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ పాటపై సల్మాన్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ఈ పాట ఏ విధంగా అభిమానులను ఆలరిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X