షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వెంటనే స్టార్‌డమ్‌ను అందుకుంటున్నారు. కానీ, మరికొందరు మాత్రం ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన చేయగల నైపుణ్యం ఉన్నా.. ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అంతగా హిట్లను మాత్రం అందుకోలేదు.
దీంతో టాలెంట్ ఉన్నా పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. ఇక, సినిమాల్లో కనిపించకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది ప్రగ్యా. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన ప్రగ్యా ప్రయాణం
ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు 'కంచె'తో రీలాంచ్ అయింది. దీనికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

వరుస షాక్‌లు.. అంత మాత్రంగా
వరుణ్ తేజ్ 'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈమె నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను పెద్దగా అందుకోలేదు.

అఖండతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
ప్రగ్యా జైస్వాల్ ఇటీవలే తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమె కెరీర్‌లోనే భారీ విజయం సొంతం అయినట్లైంది.

మరో సీనియర్ హీరోకూ జంటగా
ప్రగ్యా జైస్వాల్ యంగ్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాకపోవడంతో సీనియర్లతో జతకడుతోంది. ఇప్పటికే బాలయ్యతో కలిసి నటించిన ఈ భామ.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'లోనూ కీలక పాత్రను చేస్తోంది. డైమండ్ రత్నబాబు రూపొందిస్తోన్న ఈ పొలిటికల్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ సీనియర్ హీరో శ్రీకాంత్‌కు జోడీగా నటించింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో హీరోయిన్ రచ్చ
ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్రాళ్ల హృదయాలకు గాయాలు చేస్తోంది. ఇక, ఘాటు ఫొటోలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న ఈ అమ్మడు.. తన అందాలతో ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

షర్ట్ మొత్తం విప్పేసిన హీరోయిన్
ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ మొత్తం తీసేసి అందాల విందు చేస్తోంది. దీంతో ఆమె లోదుస్తులతో పాటు అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. మొత్తంగా ఇందులో బౌండరీలను దాటేసి మరీ గ్లామర్ షో చేసింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఇది వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











