అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!
టాలీవుడ్‌లో ఎంతో మంది గ్లామరస్ హీరోయిన్లు సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
అందానికి అందం.. నటనకు నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ అమ్మడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాలో వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా ఎంట్రీ.. నేషనల్ రేంజ్‌కు
మోడల్‌గా దేశ వ్యాప్తంగా హైలైట్ అయిన సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి పరిచయమైంది. అనంతరం జాతీయ అవార్డు మూవీ 'కంచె'తో నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను అందుకుంది.

చాలా సినిమాలు... హిట్లు అలా
ప్రగ్యా జైస్వాల్‌కు 'కంచె' తర్వాత తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఆమె ప్రతి సినిమాను చేసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు చేసింది. కానీ ఇవన్నీ డిజాస్టర్ అయ్యాయి. అయినప్పటికీ ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఆమెకు భారీ విజయాలు మాత్రం రాలేదు.

బిగ్గెస్ట్ హిట్.. ఆ వెంటనే షాక్
చాలా కాలంగా సినిమాలు చేస్తోన్న భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయిన ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమా చేసింది. ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఇది మాత్రం బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

సినిమాల్లేవు.. అలా సందడిగా
'అఖండ' వంటి భారీ సక్సెస్ తర్వాత కూడా ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు అంతగా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది బిగ్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చింది. దీని తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇలా తన పర్సనల్ లైఫ్‌ను సందడిగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అందాల ప్రదర్శనతో రచ్చ
సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా ప్రగ్యా జైస్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంత కాలంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ప్రగ్యా క్రేజ్ భారీగానే పెరుగుతోంది.

ప్రగ్యా జైస్వాల్ హాట్ సెల్పీ
హాట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు భారీగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











