18 కోట్లుకి మస్కా కొట్టిన ప్రముఖ హీరోయిన్.. వివాదంపై బ్యూటీ రియాక్షన్ ఏమిటంటే?

నార్త్ నుంచి సౌత్ కి సౌత్ నుంచి నార్త్ కి ఎప్పటికపుడు హీరోయిన్స్ కొందరు అలా పరిచయం అవుతూనే ఉంటారు. అయితే ఈ రెండు సినిమా ఇండస్ట్రీస్ నుంచి మాత్రం నార్త్ నుంచి సౌత్ లో వచ్చి పాగా వేసినవారు అత్యధికంగా కనిపిస్తారు. కాగా ఇది ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉన్న ఆనవాయితీనే..

కాగా ఇలా హిందీ సినిమా నుంచి మన తెలుగు సినిమాలో ఎప్పుడో కనిపించిన బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా అంటే మన తెలుగు ఆడియెన్స్ కి కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కాగా ప్రీతి జింటా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లతో అప్పట్లో భారీ హిట్స్ కూడా కొట్టింది. ఇలా తెలుగులో సూపర్ హిట్స్ అందుకొని తర్వాత బాలీవుడ్ లోనే ఆమె సెటిల్ అయ్యింది.

heroine preity zinta opens 18 crore scam and other rumors

ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ టీం ని ఓన్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇలా సినిమాలు, క్రికెట్ తో లైఫ్ లీడ్ చేస్తున్న ప్రీతి జింటా జస్ట్ కొన్ని రోజులు నుంచి మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా కనిపిస్తుంది. పైగా హిందూ, మన దేశానికి సంబంధించి కొన్ని ఆసక్తికర పోస్ట్ లు చేయడంతో తాను మరింత హాట్ టాపిక్ గా మారగా ఇవి కాస్త ఆమెని ఇంకొంచెం కాంట్రవర్సీలోకి నెట్టేశాయి.

కాగా ప్రీతి జింటా ఇటీవల ఓ బ్యాంకు దగ్గర 18 కోట్లు ఋణం తీసుకొని ఎగ్గొట్టింది అని ఇపుడు ఆ బ్యాంకు వారు దివాళా తీశారు అంటూ కేరళ కాంగ్రెస్ వారు అధికారిక సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఇంతే కాకుండా ఆమె రీసెంట్ గా చేస్తున్న పోస్ట్ లు సెంట్రల్ లో మోడీకి సపోర్ట్ గా కూడా ఉండడంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ ల్యూ బీజేపీకి ఇచ్చేసింది అంటూ కూడా కేరళ కాంగ్రెస్ వారు ఆమె పిక్ పెట్టి మరీ పోస్ట్ చేశారు.

దీనితో స్వయంగా ఈ రూమర్స్ పైనే ఆమె స్పందించింది. నేనే నా సోషల్ మీడియా అకౌంట్స్ ని ఆపరేట్ చేస్తాను నాపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు సిగ్గు తెచ్చుకోండి. నాపై నేను అప్పుల్లో ఉన్నానని లేదా లోన్ తీసుకున్నానని ఎవరూ రాసింది లేదు అయినా కూడా ఒక పొలిటికల్ పార్టీలో ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటివరకు నేను తీసుకున్న అన్ని అప్పులు తిరిగి చెల్లించడం జరిగింది.

రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఎప్పుడో పదేళ్ల కితమే అయిపోయింది. ఇపుడు నాకెలాంటి అప్పులు కూడా లేవు అంటూ అసలు విషయాన్ని ప్రీతి జింటా రివీల్ చేసి తనపై తప్పుడు ఆరోపణల్ని చీల్చి చెండాడింది. దీనితో తన నుంచి ఈ క్లారిటీ కూడా బాలీవుడ్ ఆడియెన్స్ లో చర్చకి దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X