కంట్రోల్ తప్పేలా హీరోయిన్ గ్లామర్ షో: డ్రెస్ ఉన్నా లేనట్లే ఘోరంగా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో కంటే ఇందులోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. ఫలితంగా నిత్యం వార్తల్లోనే ఉంటూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒక్క సినిమాతోనే నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన ఈ భామ.. ఆ తర్వాత నుంచి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, నిత్యం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ కొన్ని బోల్డ్ పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!
కన్ను గీటేసి సంచలనంగా:మలమాళంలో టీనేజ్ లవ్ కాన్సెప్టుతో రూపొందిన 'ఒరు అదార్ లవ్' అనే మూవీతో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో ఈ పిల్ల కన్నుగీటడంతో పాటు ప్లయింగ్ కిస్ గన్ సీన్లతో ఒక్కసారిగా సంచలనం అయిపోయింది. దీంతో ప్రియాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు కూడా వచ్చింది. ఫలితంగా ప్రియా ప్రకాశ్ వారియర్‌కు చాలా భాషల్లో అవకాశాలు వెల్లువెత్తాయి.

వరుస ఆఫర్లు.. తెలుగులో:మొదటి చిత్రంతోనే ఎవరికీ దక్కని గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన 'చెక్' అనే మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది. తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ఆమెకు విజయంతో పాటు నటిగా మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది.
శ్రీదేవి వివాదం.. వాటిలోనే:చిన్న వయసులోనే తెగ హైలైట్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్ బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే మూవీ చేసింది. కానీ, ఇది వివాదంగా మారడంతో విడుదలను ఆపేశారు. ఆ తర్వాతమాత్రం హిందీలో 'యారియాన్ 2' చిత్రంలో నటించింది. అలాగే, '4 ఇయర్స్', 'లైవ్', 'కొళ్ల', 'సుభద్రహరణం' వంటి సినిమాల్లో అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది.

పవన్‌తో అలా.. ఇప్పుడివే:మిగిలిన భాషల కంటే తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇటీవలే పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'BRO' మూవీలోనూ నటించింది. కానీ, ఇది ఆమెకు ఏమాత్రం ప్లస్ కాలేదు. ఇక, ఇప్పుడు ప్రియా హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్'.. కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీలతో బిజీగా మారింది.
ఫ్యాన్స్‌ను అలరించేలా:టీనేజ్‌లోనే ఎవరికీ లభించనంత క్రేజ్‌ను దక్కించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో పంచుకుంటూ అలరిస్తోంది.

ఘాటు షోలో గీత దాటి:సినిమాల పరంగా ఎంత బోల్డుగా ఉంటుందో.. పర్సనల్ లైఫ్‌లోనూ ప్రియా ప్రకాశ్ వారియర్ అదే రీతిలో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇందులో భాగంగానే తరచూ ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ రెచ్చిపోతోంది. ఫలితంగా క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

ప్రియా ప్రకాశ్ బోల్డ్ ట్రీట్:వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ డ్రెస్‌లో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో ఆమె టాప్ అందాలు డ్రెస్ ఉన్నా లేనట్లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విశేషమైన రీతిలో రెస్పాన్స్ వస్తోంది తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











