39 ఏళ్ల ఏజ్‌లో ఓవర్ డోస్ గ్లామర్ షో.. జాకెట్ లేకుండా చీరకట్టులో ప్రియమణి

టాలీవుడ్‌లో చాలా ఏళ్ల పాటు హవాను చూపించి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి వచ్చిన ఈమె.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది.

ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ సత్తా చాటుతూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియమణి తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

Heroine Priyamani Latest Stunning Photos Viral in Social Media

తెలుగు సినిమాతోనే ఎంట్రీ
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్రియమణి.. తెలుగు చిత్రం 'ఎవరే అతగాడు'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'పెళ్లైన కొత్తలో' అనే మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ.. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసనా నటించింది. ఫలితంగా చాలా కాలం స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది.

Heroine Priyamani Latest Stunning Photos Viral in Social Media

చాలా భాషలు.. అవార్డులు

తెలుగులోనే పరిచయమైన ప్రియమణి.. తర్వాత తమిళం, మలయాళం, కన్నడంలో వరుస సినిమాలు చేసింది. తద్వారా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ హవాను చూపించింది. ఇక, తమిళంలో వచ్చిన 'పరుత్తివీరన్' సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డును సైతం అందుకుని సత్తా చాటింది. దీంతో ప్రియమణి క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది.

Heroine Priyamani Latest Stunning Photos Viral in Social Media

నేషనల్ రేంజ్ హీరోయిన్
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించి సత్తా చాటిన ప్రియమణి.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోనూ తెగ సందడి చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో హిట్లు అందుకున్న ఈ భామ.. ఇటీవలే 'ఆర్టికల్ 370' అనే చిత్రం వంద కోట్లు కొల్లగొట్టింది. అలాగే, 'భామాకలాపం' అనే వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌లో కూడా నటించింది. ఇలా అన్నింట్లోనూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

ఇప్పుడు ఈ సినిమాలతో

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ప్రియమణి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె ఇప్పుడు ఒక్క మూవీని కూడా మొదలెట్టలేదు. కానీ, హిందీలో 'మైదాన్' అనే భారీ మూవీలో భాగం అయింది. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది. వీటితో పాటు ఇప్పుడు ప్రియమణి తమిళంలో 'క్వటేషన్ గ్యాంగ్', కన్నడంలో 'ఖైమారా' అనే సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Heroine Priyamani Latest Stunning Photos Viral in Social Media

అందులోనే రచ్చ చేస్తూ
సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంటోన్న ప్రియమణి.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో మూవీ అప్‌డేట్లను కూడా వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా దీని ద్వారానే షేర్ చేస్తూ మజాను పంచుతోంది.

Heroine Priyamani Latest Stunning Photos Viral in Social Media

జాకెట్ లేకుండా ట్రీట్

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియమణి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్ లేకుండా చీర కట్టుకుని కనిపిస్తూ షాక్ ఇచ్చేసింది. ఫలితంగా ఈ పిక్స్ అన్నీంటికీ నెటిజన్ల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది. దీంతో ప్రియమణి ఫొటోలు అన్నీ చాలా తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X