Priyanka Jawalkar: బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. అతను ఎవరంటే?
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ ప్రియాంక జవాల్కర్. మరాఠీ ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ వచ్చిన కొత్తలోనే ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటోలకు భారీ స్థాయిలో లైక్స్ వస్తూ ఉంటాయి. చూడగానే చిరునవ్వుతో ఆకట్టుకునే ప్రియాంక ప్రేమలో పడింది అని ఇటీవల ఆమె బాయ్ ఫ్రెండ్ తో కూడా ఫోటో దిగినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రియాంక అసలు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జాబ్ వదిలేసి..
అనంతపురం కు చెందిన ప్రియాంక జవాల్కర్ మరాఠి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక హైదరాబాద్ లోనే తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న ప్రియాంక ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా కూడా వెళ్ళింది. అక్కడ ఎనిమిది నెలల పాటు ఆమె ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది. మంచి చదువుతోపాటు ఉద్యోగంలో కొనసాగుతున్న ఆమె హఠాత్తుగా మళ్ళీ చిత్ర పరిశ్రమ వైపు యూటర్న్ తీసుకుంది.

2017 లో టాలీవుడ్ ఎంట్రీ
ఉద్యోగం చేసే క్రమంలోనే ప్రియాంక జవాల్కర్ సినిమాల్లో అవకాశాల కోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. తరచుగా ఆమె కొన్ని ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిసిన సినీ ప్రముఖులను కూడా సంప్రదించింది. ఇక మొదట ఆమె కలవరమాయే మదిలో అనే సినిమాతో 2017లో వెండితెరకు పరిచయం అయింది

టాక్సీ వాలా సినిమాలో
ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఆమెకు మంచి నటిగా గుర్తింపు లభించింది. తరువాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకి మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ తొందరపడకుండా కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవాలి.

వరుసగా సినిమాలు
టాక్సీ వాలా సినిమా అనంతరం ప్రియాంక తిమ్మరుసు అనే సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా మంచి గుర్తింపు అందుకుంది. శ్రీయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గమనం సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ ప్రాజెక్టులు కూడా ఈ బ్యూటీకి పెద్దగా కలిసిరాలేదు. ఇక ప్రస్తుతం గ్లామరస్ ఫోటో షూట్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

ప్రేమలో ప్రియాంక?
అయితే రీసెంట్ గా ప్రియాంక జవాల్కర్ ప్రేమలో పడింది అని ఆమె ఇటీవల నిర్వహించిన ఫోటో షూట్ లో కూడా బాయ్ ఫ్రెండ్ తో ప్రత్యేకంగా ఒక ఫోటో కూడా దిగినట్లుగా అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరకు ప్రియాంక ఈ కథనాలపై స్పందించక తప్పలేదు.

క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
సోషల్ మీడియా ద్వారా ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రియాంక జవాల్కర్ ఈ విధంగా వివరణ ఇచ్చింది ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఫోటో షూట్లో కెమెరా వర్క్ లో సహాయం చేయడానికి వచ్చిన ఒక టెక్నీషియన్ అని.. అతను నా బాయ్ ఫ్రెండ్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరణ ఇచ్చింది. దీంతో ఆ వార్తలు అన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











