అతి చిన్న డ్రెస్‌లో రత్తాలు: గీత దాటేసి మరీ అందాల ప్రదర్శన
సౌతిండియాలోని చాలా మంది హీరోయిన్లు దేశ వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో సినిమాలు చేసి సందడి చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే కాస్త ఎక్కువ గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో హాట్ లేడీ రాయ్ లక్ష్మీ ఒకరు.
అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా గ్లామర్ షో చేస్తూ సెన్సేషన్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా రాయ్ లక్ష్మీ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దాన్ని మీరే చూడండి!

ఇక్కడ ఆ సినిమాలు చేసినా: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడలింగ్ రంగంలో సత్తా చాటిన రాయ్ లక్ష్మీ.. శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. కానీ, ఈ మూవీ ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమాలో మాత్రమే చేసింది. కానీ ఇది కూడా నిరాశ పరిచింది. దీంతో టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది.

బాలీవుడ్ ఎంట్రీతో హైలైట్: తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లి.. 'జూలీ 2'లో హాట్ ట్రీట్ ఇచ్చి అందాల ఆరబోతతో యమ హైలైట్ అయింది.

ధోనీతో ఎఫైర్.. కాంట్రవర్శీ: కెరీర్ పరంగా తనదైన స్థాయిలో సందడి చేస్తోన్న రాయ్ లక్ష్మీ.. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ ఎమ్మెస్ ధోనీతో డేటింగ్ చేస్తుందన్న వార్తతో సెన్సేషన్ అయింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్శీల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇక, టాలీవుడ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ 'బలుపు', 'సర్ధార్ గబ్బర్ సింగ్', 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌లో మెరిసింది.

ఇప్పుడూ వరుస సినిమాలు: గతంలో మాదిరిగా రాయ్ లక్ష్మీ వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. ఇప్పుడు కూడా బిజీగానే గడుపుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటించింది. అలాగే, కన్నడంతో 'ఝాన్నీ ఐపీఎస్', తమిళంలో 'గ్యాంగ్‌స్టర్', మలయాళంలో 'మాన్‌స్టర్' వంటి చిత్రాలు చేసింది. ఈ ఏడాది 'భోళా'లో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.

అందులో యమ బిజీగానే: కెరీర్ ఆరంభం నుంచీ సక్సెస్ రేటు తక్కువగానే ఉన్నా.. రాయ్ లక్ష్మీ మాత్రం వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా తన కెరీర్ గురించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

డోసు తగ్గించని హీరోయిన్: హీరోయిన్‌గా వచ్చిన కొత్తలో డీసెంట్‌గానే కనిపించిన రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ షోతో సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా తన ఘాటు అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

బికినీలో బాడీ షో చేస్తోంది: రాయ్ లక్ష్మీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బ్లాక్ కలర్ బికినీ ధరించి ఘాటుగా ఫోజులిచ్చింది. అంతేకాదు, దీని నుంచి విపరీతంగా షో చేస్తూ అందాలను ఆరబోస్తోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











