For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘాటు ఫొటోతో హీటు పెంచేసిన రాయ్ లక్ష్మీ: స్విమ్‌సూట్‌లో అందాలు మొత్తం కనిపించేలా!

  |

  సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమదైన శైలి నటనతో పాటు అందంతో కవ్విస్తూ సత్తా చాటుతున్నారు. ఒకవేళ సినిమాల్లో నటించకున్నా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ట్రీట్ ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో సౌతిండియన్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. అదే సమయంలో అద్భుతమైన అందాలతో ప్రేక్షకులు అందరినీ ఫిదా చేసేసింది.

  ఇక, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పంథాను మార్చుకున్న రాయ్ లక్ష్మీ.. శృతి మించిన బోల్డు షోతో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో స్విమ్‌సూట్ వేసుకుని దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

  కంగనా రనౌత్ ఘాటు ఫోజులు: అరాచకమైన ఫొటోలతో రచ్చ చేసిన బ్యూటీ

  అలా ప్రవేశించింది.. ఇలా పాపులరిటీ సొంతం

  అలా ప్రవేశించింది.. ఇలా పాపులరిటీ సొంతం

  చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. అందులో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసింది. దీని అనంతరం ఈ భామ టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ సుందరాంగి తెలుగు తెరకు దూరంగా ఉంటూ వచ్చింది.

  పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

  బాలీవుడ్‌లోకి వెళ్లి... ఫుల్ ఫేమస్ అయింది

  బాలీవుడ్‌లోకి వెళ్లి... ఫుల్ ఫేమస్ అయింది

  తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసినా సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లింది. 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. తద్వారా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫేమస్ అయింది. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలను అందుకోగలిగింది.

  టాలీవుడ్‌కు ఐటెం గర్ల్‌గా... రత్తాలు అదుర్స్

  టాలీవుడ్‌కు ఐటెం గర్ల్‌గా... రత్తాలు అదుర్స్


  సరైన బ్రేక్ దొరకక చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోయిన రాయ్ లక్ష్మీ.. నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు'తో రీఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక, ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో ఊపేసింది. దీంతో ఈ అమ్మడకి తెలుగులో మంచి పేరు దక్కడంతో పాటు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి.

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా లేకున్నా సౌతిండియన్ బ్యూటీ రాయ్ లక్ష్మీ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా కెరీర్‌ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. సినిమాలు లేకున్నా ఈమె దీని ద్వారానే వాళ్లతో నిత్యం టచ్‌లో ఉంటూ వస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీగా ఉంటున్నారు.

  వరుస సినిమాలు.. ఫైటింగులు చేస్తోన్న లక్ష్మీ

  వరుస సినిమాలు.. ఫైటింగులు చేస్తోన్న లక్ష్మీ

  సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడం వల్ల రాయ్ లక్ష్మీకి దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. దీంతో ఆమెకు అన్ని భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల కోసం ఈ అమ్మడు ఎన్నో సాహసాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె ప్రస్తుం చేస్తున్న వాటిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటి కోసం ఫైటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటోంది. అలాగే, షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. ఆయా ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది.

  'కార్తీక దీపం' సౌందర్య పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న అర్చన

  అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న హీరోయిన్

  అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న హీరోయిన్

  కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకు పెద్దగా ఇష్టపడని రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం పంథాను మార్చుకుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ బోల్డు షోతో సెగలు రేపుతోంది. టాప్‌ టూ బాటమ్ అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అందాలను ఆరబోస్తూ ఆమె షేర్ చేసే ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా వీటికి లక్షల్లో లైకులు, కామెంట్లు కూడా వస్తున్నాయి. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  స్విమ్‌సూట్ ఫొటోతో సెగలు రేపుతోన్న బ్యూటీ

  స్విమ్‌సూట్ ఫొటోతో సెగలు రేపుతోన్న బ్యూటీ

  రాయ్ లక్ష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె స్విమ్‌సూట్ ధరించి ఉంది. ఈ పిక్‌లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న ఈ హాట్ ఫొటోలో అమ్మడి అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన వస్తోంది. తద్వారా ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. దాదాపు దీనికి లక్ష వరకూ లైకులు కూడా దక్కాయి.

  English summary
  South Indian Heroine Raai Laxmi Very Active in Socail Media. Now She Shared Hot Swimsuit Photo in Instagram. These Pic Gone Viral in Inernet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X