షర్ట్ బటన్స్ విప్పేసి షాకిచ్చిన లక్ష్మీ రాయ్: లోదుస్తులు కూడా లేకుండా సెల్ఫీ!
కొన్ని సినిమాలు మాత్రమే చేసినా.. ఎంతో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఒకరు. దక్షిణాది భాషల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మీ.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయమైన రాయ్ లక్ష్మీ
పేరుకు కన్నడ అమ్మాయే అయినా.. తెలుగులో శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఇక్కడ అంత గుర్తింపును అందుకోలేకపోయింది. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసి.. టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ సుందరాంగి కనిపించనేలేదు.

బాలీవుడ్ ఎంట్రీతో భారీగా ఫేమస్
తెలుగులో సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం హిట్లను దక్కించుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లింది. 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

సీనియర్ హీరోల కోసం వచ్చింది
తెలుగులో విజయాలు దక్కక వెళ్లిపోయిన రాయ్ లక్ష్మీ.. బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు'తో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక, ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో ఊపేసింది.

అందులో రచ్చ చేస్తోన్న బ్యూటీ
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా కెరీర్ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.

డేటింగ్ అంటూ షాకిచ్చిన భామ
సోషల్ మీడియా పుణ్యమా అని రాయ్ లక్ష్మీకి దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. దీంతో ఆమెను అభిమానించేవాళ్లు లక్షల మంది అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోబోతున్నానని బాంబ్ పేల్చింది. 'కొంత కాలంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నా. నా ఎంగేజ్‌మెంట్ తేదీ ఫిక్సయింది' అని ఇన్‌స్టాలో వెల్లడించింది.

హాట్ షోతో సెగలు రేపుతోందిగా
రాయ్ లక్ష్మీ ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటి కోసం ఫైటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటోంది. అలాగే, షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ గ్లామర్ షోతో సెగలు రేపుతోందీ బ్యూటీ. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
Recommended Video

షర్ట్ బటన్స్ విప్పేసిన హీరోయిన్
రాయ్ లక్ష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె షర్ట్ బటన్స్ తీసేసి కనిపిస్తోంది. అంతేకాదు, లోదుస్తులు కూడా లేకుండా ఈ సెల్ఫీని తీసుకుంది. దాన్ని తన షేర్ చేస్తూ శుభ శనివారం అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. ఇది చూసిన వారంతా అమ్మడి స్కిన్ గ్లోకు ఫిదా అయిపోతున్నారు.


Click it and Unblock the Notifications











