గ్లామర్ షోతో రచ్చ లేపిన రాశీ ఖన్నా.. ఇంతలా ఎప్పుడూ తెగించలేదుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని, వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు. అదిరిపోయే అందం, ఆకట్టుకునే నటనతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. ఇండియా వ్యాప్తంగా చాలా భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ మధ్య తెలుగులో పెద్దగా చిత్రాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాశీ ఖన్నా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!
అలా వచ్చి ఫుల్ ఫేమస్:టీనేజ్‌లోనే 'మద్రాస్ కేఫ్' అనే బాలీవుడ్ చిత్రంతో రాశీ ఖన్నా నటిగా పరిచయమైంది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఈ మూవీలో అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. నటనతోనూ అలరించింది. ఇక, ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది. అలాగే, ఆమె ఫుల్ ఫేమస్ అయింది.

ఆ భాషల్లోనూ ఫుల్లుగానే:తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఆరంభాన్ని అందుకున్న రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళంలోకి కూడా ఎంటరైంది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది ఆఫర్లు అందుకుని నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.
వరుస ఫ్లాపులు వచ్చినా:సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న రాశీ ఖన్నా.. తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది. కానీ, ఈ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఆమెకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది.

ఆ సినిమాలు చేస్తోంది:తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో మాత్రం పెద్దగా ప్రాజెక్టులను ఓకే చేయడంలేదు. అయితే, ఇప్పుడామె 'తెలుసు కదా' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. అలాగే, హిందీలో మాత్రం ఈ చిన్నది 'యోధ' అనే సినిమాను చేస్తోంది. అలాగే, తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలను చేస్తోంది.
అందులో కూడా బిజీగా:ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ మజాను పంచుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను సైతం పెంచుకుంటూ వెళ్తోంది.

గ్లామర్ డోస్ పెంచింది:చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
రాశీ హాట్ పిక్స్ వైరల్:క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్ విప్పేసి మరీ లోదుస్తులతో దర్శనం ఇచ్చింది. అంతేకాదు, విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫొటోలు అన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











