రాశిఖాన్నాకు షాకిచ్చిన డైరెక్టర్.. ఆ మూవీ నుంచి అవుట్!

టాలీవుడ్ సినిమా అనే కాకుండా ఏ ఇండస్ట్రీ లో అయినా కూడా హీరోయిన్ గా ఓ యంగ్ నటి కెరీర్ ఆరంభించినపుడే అందరి దృష్టి ఆకర్షించడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అది కూడా ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లాంటి సినిమా, ఎలాంటి స్కిన్ షో లాంటిది కూడా లేకుండా అంటే అలా గగనమే అని చెప్పాలి. మరి సరిగ్గా ఇలాంటి ఓ సినిమా చేసి టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ ని అందుకున్న యంగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాశి ఖన్నా అని చెప్పవచ్చు.

మొదటి సినిమా "ఊహలు గుసగుసలాడే" తో ఒక క్లీన్ డెబ్యూ ఇచ్చి అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ నెక్స్ట్ సినిమా నుంచే గ్లామరస్ రోల్స్ కి కూడా తక్కువ కాదని పలు సాలిడ్ పాత్రలు కూడా సొంతం చేసుకుంది. అయితే మరీ అంత స్టార్ హీరోయిన్ స్టేటస్ ఆమె తెచ్చేసుకోలేదు కానీ మిడ్ రేంజ్ లో అయితే పర్వాలేదనిపిస్తూ మంచి ఆఫర్స్ నే అందుకుంది.

heroine raashi khanna out from this crazy sequel project

కానీ మధ్యలో ఆమె శరీర ఆకృతిపై వచ్చిన కామెంట్స్ పై కూడా ఫిజికల్ గా మారి చూపించి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలా రీసెంట్ గా "బాక్" అనే సినిమాలో కనిపించింది. ఇది తమిళ నాట పెద్ద హిట్ కాగా అరణ్మణై అనే హారర్ సిరీస్ లో నాల్గవ సినిమాగా వచ్చింది. అయితే రాశి మూడో సినిమాలో కూడా నటించి నాల్గవ సినిమా సీక్వెల్ కి వరుసగా చేసింది.

కానీ ఈ సీక్వెల్ కాకుండా మరో క్రేజీ సీక్వెల్ నుంచి ఈమె వైదొలిగినట్టుగా ఇప్పుడు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమానే గత 2022 లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం "సర్దార్". హీరో కార్తీ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించగా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్ళతో మంచి హిట్ అయ్యింది.

heroine raashi khanna out from this crazy sequel project

కాగా ఈ సినిమాలో రాశి ఖన్నా చాలా ముఖ్యమైన పాత్రనే చేసింది కానీ ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ "సర్దార్ 2" లో మాత్రం భాగం కాలేకపోయింది అని వినిపిస్తుంది. సర్దార్ 2 లో ఈమె ప్లేస్ లో రీసెంట్ యంగ్ బ్యూటీ ఆశికా రంగనాథ్ చోటు దక్కించుకున్నట్టుగా కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. సో ఈ సినిమా నుంచి రాశి ఖన్నాని తప్పించేశారని కొందరు అనుకుంటున్నారు.

అయితే ఆమెతో పాటుగా ఈమె కూడా ఉందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ తీసేస్తే మిత్రన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో కూడా చూడాలి. మరి స్పై జానర్ లో వచ్చిన ఈ చిత్రంలో కార్తీ తన నట విశ్వ రూపం చూపించాడు. అందుకే తన ఖైదీ 2 తో పాటుగా ఈ సినిమా సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే మొదలు పెట్టే సన్నాహాలు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం బజ్ ఉంది.

More from Filmibeat

Read more about: raashi khanna karthi baak movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X