Rashi Khanna అందాల విందుతో హీట్ పెంచిన బ్యూటీ.. బాలీవుడ్‌లోనూ జోరు చూపుతుందా?

బొద్దుగా, ముద్దుగా ఉండే రాశీ ఖన్నా లాక్‌డౌన్ సమయంలో సన్నబడింది. కఠినమైన వర్కౌట్లు, డైటింగ్
చేసి నాజూకుగా తయారైంది. అప్పట్నుంచి హాట్ హాట్ ఫొటో షూట్లలో పాల్గొంటూ అభిమానులకు
కనువిందు చేస్తోంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ హీట్ పెంచుతోంది. ఇప్పటివరకు
పక్కింటమ్మాయి తరహా పాత్రల్లోనే కనిపించిన రాశి ఇకపై గ్లామరస్ హీరోయిన్‌గా మెరిసేందుకు
సిద్ధమవుతోంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా
బాలీవుడ్ ఆఫర్ కూడా పట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.

రాశి మారుతుందా?

రాశి మారుతుందా?

ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన రాశికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. తనతో
పాటే తెరంగేట్రం చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా ఎదిగిపోయింది. తెలుగులో అగ్ర హీరోలందరి
సరసనా నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. రాశి మాత్రం స్టార్ హీరోల సినిమాలకు దూరంగానే
ఉండిపోయింది. కమర్షియల్ హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్నా రాశికి ఎందుకనో లక్ కలిసి
రాలేదు. దీంతో ఆమె ప్రస్తుతం రూటు మార్చింది. హాట్ హాట్ పాత్రల్లో నటించేందుకు సిద్ధమేనంటూ
పరోక్షంగా దర్శకనిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోంది.

చేతి నిండా సినిమాలు

చేతి నిండా సినిమాలు

రాశి ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌-మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పక్కా కమర్షియల్,
నాగచైతన్య థ్యాంక్యూ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో కార్తీ సరసన సర్దార్ సినిమాలో
నటిస్తోంది. ఇక, మలయాళంలో ఇటీవల విడుదలైన భ్రమం సినిమా రాశికి అక్కడ మంచి పేరు
తీసుకొచ్చింది. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకునేందుకు రాశి ప్రయత్నిస్తోంది. పక్కింటమ్మాయి
తరహా పాత్రలు తగ్గించి పూర్తి గ్లామరస్ అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు స్కెచ్ వేస్తోంది.

బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర మీద కూడా రాశీ ఖన్నా తన సత్తా చాటాలని
నిర్ణయించుకుంది. ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరగడంతో వాటి ద్వారా కూడా ప్రజలకు చేరువ
కావాలని చూస్తోంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో
తెరకెక్కుతోన్న రుద్ర వెబ్‌సిరీస్‌లోనూ, సన్నీ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ రెండూ ఇంకా విడుదల
కాకముందే బాలీవుడ్ నుంచి రాశి మరో బంపరాఫర్ పట్టేసినట్టు సమాచారం. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్
జోహార్ రూపొందించనున్న ఓ భారీ సినిమాలో ఛాన్స్ రాశిని వరించిందట. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా
నటిస్తున్న ఆ చిత్రంలో దిశా పటానీతో పాటు మరో హీరోయిన్‌గా రాశి కనిపించనుందట.

Recommended Video

Tollywood Top 10 Heroines List || Filmibeat Telugu
 హాట్ ఫొటోస్‌తో హల్‌చల్

హాట్ ఫొటోస్‌తో హల్‌చల్


చేతి నిండా సినిమాలతో బిజీగా ఉనప్పటికీ రాశి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన
వ్యక్తిగత, వృత్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది. వీలైనప్పుడల్లా తన
హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు అందాల విందు అందిస్తోంది. మోడ్రన్ డ్రెస్స్‌ల్లోనే కాదు
సాంప్రదాయ చీరకట్టులో కూడా తను అందంగా కనిపించగలనని నిరూపిస్తోంది. ఇటీవల చీరకట్టులో రాశి
చేసిన అందాల విందు అభిమానులకు ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X