Raashii Khanna సిద్ధార్థ్‌తో రాశీ ఖన్నా పెళ్లి.. మరి ఆ హీరోయిన్ ఊరుకుంటుందా బాసూ!
టైటిల్ చూసి షాకయ్యారా... నిన్నటి వరకు సిద్ధార్థ్.. తను ప్రేమించిన హీరోయిన్ అదితి రావు హైదరితో ఎంగేజ్ అవుతే.. మధ్యలో రాశీ ఖన్నా ఎందుకు వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా...? అయితే అనుకుంటే మీరు పొరబడినట్లే! సౌత్ ఇండస్ట్రీలో మనకు హీరో సిద్ధార్థ్ ఉన్నట్లే.. నార్త్ వాళ్లకి ఓ సిద్ధార్థ్ ఉన్నాడు. ఈ పాటికి మీరు గుర్తు పట్టి ఉంటారు.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర. ఆయన ఇటీవల రాశీ ఖన్నాతో క్లోజ్ గా మూవ్ అవ్వడంతో.. పెళ్లంటూ ప్రచారం జరిగింది. అసలు అంతలా రూమర్స్ ఎందుకు వచ్చాయి.. దీనిపై రాశీఖన్నా ఎలా స్పందించిందనే వివరాల్లోకి వెళితే...
హీరో సిద్ధార్థ్ మల్హోత్ర.. ఇండస్ట్రీకి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో పరిచయం అయ్యాడు. ఇక మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో నటించిన వరున్ ధావన్, అలియా భట్ కి కూడా మంచి బ్రేక్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ పలు సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా ఎదిగాడు. హ్యాండ్సమ్ లుక్స్, ఫర్ఫెక్ట్ బాడీతో ఉండే సిద్ధార్థ్ కు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ఆయన లుక్స్ కి ఫిదా అయిపోతారు.

ఇదిలా ఉంటే.. సిద్దార్థ్ మల్హోత్రా ఆ మధ్య హీరోయిన్ కియారా అద్వానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ ఇటీవల మన టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నాతో కలిసి యోధ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరు జంటగా అటు ఇటు తిరిగారు. ఈ సినిమా మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా - రాశీఖన్నా పెయిర్ బాగుందని కామెంట్స్ వచ్చాయి. ఇద్దరూ క్యూట్ గా ఉన్నారని, ఒకరికి ఒకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మరికొంతమంది అయితే రాశీఖన్నా సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంతమంది మరి రాశీఖన్నా.. సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుంటే కియారా ఊరుకుంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రాశీఖన్నాని దీని గురించి అడిగింది.

దీనిపై మన రాశీఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అభిమానులకు, ప్రేక్షకులకు వారు చూసే నటీనటులపై వివిధ అభిప్రాయాలు ఉండొచ్చన్న ఈ బ్యూటీ... వారు తీసే సినిమాలు, కలిసి నటించే వారితో రకరకాల అభిప్రాయాలూ ఉంటాయని చెప్పుకువచ్చింది. కానీ వారికి మా పర్సనల్ లైఫ్స్ గురించి తెలియదని వెల్లడించింది. సినిమాలో కలిసి అందంగా కనిపించినంత మాత్రాన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింత మాత్రాన అది రియల్ లైఫ్ లో సాధ్యపడదని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











