అతడు చీటింగ్ చేశాడు. బ్రేకప్‌తో దారుణంగా కుంగిపోయా.. రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలో కూడా తన కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్న హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం ది సబర్మతి రిపోర్ట్ అనే వివాదాస్పద కథాంశంతో వస్తున్న సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీ, రిద్ది డోగ్రా తదితరులు నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు. నవంబర్ 15వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన లవ్ బ్రేకప్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే వరుణ్ తేజ్‌తో కలిసి తొలి ప్రేమ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. తన కాలేజీ సమయంలో అఫైర్ ఉండేది. నా బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది. ఆ తర్వాత నా కేరీర్‌పై ఫోకస్ పెట్టాను అని చెప్పింది.

ఇక తాజాగా ది సబర్మతి రిపోర్టు అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన జీవితంలో చోటు చేసుకొన్న మరో బ్రేకప్ గురించి కూడా వెల్లడించింది. అయితే సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత తనకు ఒకరితో అఫైర్ కొనసాగింది. ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ చేశాను. అతడు చీట్ చేయడంతో నా అఫైర్ మరోసారి బ్రేకప్ అయింది అని తన ఆవేదన వ్యక్తం చేసింది.
లైఫ్‌లో బ్రేకప్ తర్వాత నేను చాలా రోజులు మానసికంగా కుంగిపోయాను. ఆ తర్వాత చాలా ఎమోషనల్‌గా మారిపోయాను. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని ఇచ్చారు. నా స్నేహితులు నైతికంగా అండగా నిలిచారు. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతీసారి మానసికంగా ధృడంగా తయారయ్యాను. అప్పటి నుంచి నాకు ఇండస్ట్రీ బయటే ఎక్కువ స్నేహితులు ఉన్నారు అని చెప్పారు.
తెలుగు సినిమా రంగంలో రాశీఖన్నా పలువురి హీరోలతో కలిసి నటించింది. తొలి చిత్రంలో నాగశౌర్య, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, హీరో రామ్, గోపిచంద్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగచైతన్య తదితరులతో నటించింది. అయితే ఈ హీరోల్లో ఆమెకు ఎవరితో బ్రేకప్ అయిందనే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే స్వయంగా ఆమె వెల్లడిస్తే గానీ అసలు విషయం బయటపడదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











