హీరోయిన్ లక్ష్మీ రాయ్ ఇంట్లో తీవ్ర విషాదం.. కళ్లముందే ఇష్టమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో..

టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ మొదటిసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఆమె ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కళ్ళముందే ఇష్టమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు కూడా షేర్ చేసుకుంది.

లక్ష్మీ రాయ్ ఇంట్లో విషాదం

లక్ష్మీ రాయ్ ఇంట్లో విషాదం

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మరణాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా అనే కాకుండా ఇతర కారణాలతో కూడా చాలా మంది తనువు చాలించారు. ఇక లక్ష్మీ రాయ్ ఇంట్లో కూడా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తండ్రి ప్రాణాలు విడువడంతో ఒక్కసారిగా ఆమె షాక్ కి గురయ్యింది. సోషల్ మీడియాలో తన తండ్రి గురించి బావోద్వేగంతో నివాళులర్పించింది.

మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను

మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను

మిస్ యూ నాన్న. నేను మిమ్మల్ని ఎప్పటికి మరచిపోలేను. క్షమించండి మిమ్మల్ని నేను కాపాడుకోలేకపోయాను. నిజంగా మీరు ప్రేమించినంతగా నన్ను ఎవరు ఇష్టపడలేదు. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా నాకు మీ మద్దతు ఉండేది. చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. మీరు లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆ లోటుతోనే బ్రతుకుతానని పేర్కొంది.

కళ్ళముందే పోగొట్టుకున్నా..క్షమించండి

కళ్ళముందే పోగొట్టుకున్నా..క్షమించండి

నన్ను క్షమించండి.. మిమ్మల్ని కళ్ళముందే పోగొట్టుకున్నాను. కాపాడుకోలేకపోయాను. నా వెన్నుముక లాంటి వారు మీరు. నేను ఏం చేసినా కూడా మీరు ఎంతగానో నమ్మారు. నా ప్రతి పనిలో అండగా ఉన్నారు. నేను స్వతంత్రంగా బలంగా ఉండాలని కోరుకున్నారు. నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఈ క్షణం నాకు భారంగా ఉన్నప్పటికీ నేను మీ కోరిక ప్రకారమే ఆత్మస్థైర్యంతో ఉండడానికి ప్రయత్నం చేస్తానని లక్ష్మీ రాయ్ తెలిపింది.

సడన్ గా ఫోటోస్ పోస్ట్ చేయడంతో

సడన్ గా ఫోటోస్ పోస్ట్ చేయడంతో

లక్ష్మీ రాయ్ తన తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనకు గురయినట్లు ఆమె పోస్ట్ చేసిన విధానం చూస్తుంటే ఈజీగా అర్ధమవుతోంది. ఎల్లప్పుడు తన సినిమా ఫొటోస్ తో హ్యాపీగా సరదాగా నెటిజన్లను ఆకట్టుకునే లక్ష్మీ రాయ్ సడన్ గా తండ్రి మరణవార్త గురించి చెప్పడంతో ఆమె ఫాలోవర్స్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఆమె రత్తాలు పాటతో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X