కండోమ్స్ టెస్ట్ చేసే పాత్రపై రకుల్ క్లారిటీ.. ముద్దు సీన్స్ లేకుండా అలా మాత్రమే చూపించబోతున్నాం అంటూ

గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా పలు వైవిధ్యమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా కూడా ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. నలుగురి కంటే విభిన్నంగా నటించాలి అనే ఆలోచనతో రకుల్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టు లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల ఆమె కండోమ్ టెస్ట్ చేసే ఒక అమ్మాయి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. ఆ పాత్ర పై మరోసారి రకుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు

కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది కేవలం మిడియం రేంజ్ హీరోలతో మాత్రమే కాకుండా స్టార్ హీరోలతో కూడా ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా ఈ బ్యూటీ ప్రాజెక్టులో సెలెక్ట్ చేసుకునే విషయంలో మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు.

వరుసగా అపజయాలు వస్తున్నా..

వరుసగా అపజయాలు వస్తున్నా..

తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ కు వరుస ఫ్లాప్స్ ఎదురవడంతో ఈ బ్యూటీ ఈ మధ్య బాలీవుడ్ లోనే ఎక్కువ గా పనిచేస్తోంది. అక్కడ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు పైగా రిలీజ్ కు సిద్ధం చేసింది అంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 చేతిలో మంచి సినిమాలు

చేతిలో మంచి సినిమాలు

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్లో అయితే ఎటాక్, డాక్టర్ జి, థాంక్ గాడ్, అయాలన్.. ఇలా విభిన్నమైన సినిమాలను లైన్ లో పెట్టింది. ఇందులో ఏ సినిమా సక్సెస్ అయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్ మరో స్థాయికి చేరుకున్నట్లే అని చెప్పవచ్చు.

కండోమ్ టెస్టర్ గా..

కండోమ్ టెస్టర్ గా..

అంతే కాకుండా రకుల్ పలు ప్రయోగాత్మకమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కండోమ్ తయారుచేసిన తర్వాత వాటిని టెస్ట్ చేసే పాత్రలో నటించేందుకు కూడా ఈ బ్యూటీ ఒప్పుకుంది. ఛత్రివలి అనే ఆ సినిమాలో కండోమ్‌ల వ్యాపారం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉంది.

ఆ పాయింట్ చూపించనున్నాం అంటూ..

ఆ పాయింట్ చూపించనున్నాం అంటూ..

అయితే కండోమ్ పరీక్షించే మహిళ పాత్ర లో రకుల్ ప్రీత్ సింగ్ ఎలా నటించింది అనేది ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఆ పాత్ర పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్‌గా నటిస్తోన్న ఆమె ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదని చెప్పింది. మేము చులకనగా ఏమీ చూపించడం లేదు అంటూ సినిమాలో ఒక్క ముద్దు కూడా లేదని ఒక స్మాల్ టౌన్ అమ్మాయి ఈ ఉద్యోగంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది అనే పాయింట్ ను చూపించనున్నట్లు చెప్పింది.

Recommended Video

Rakul Preet Singh Revealed Her Role In Director Krrish Movie ​| Filmibeat Telug
తేడా కొడితే..

తేడా కొడితే..

ఏదేమైనా రకుల్ చేసే పాత్రపై ప్రస్తుతం మీడియాలో మాత్రం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆమె ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం నిజంగా సాహసమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా కంటెంట్ క్లిక్ అయితే మాత్రం బాలీవుడ్లో ఆమె రేంజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ తేడా కొడితే మాత్రం గతంలో మాదిరిగా ట్రోలర్స్ కు అవకాశం ఇచ్చినట్లే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X