Rakul Preet Singh: పెళ్లికి ముందు పెళ్లి తర్వాత.. రకుల్ కామెంట్లు.. ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం అంతకు మించిన నటనను కనబర్చే ఈమె ఇటీవలే తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. గోవాలో గ్రాండ్ గా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని చేత మూడు ముళ్లు వేయించుకుంది. ప్రస్తుతం భర్తతో చాలా హాయిగా గడుపుతున్న ఈమె పెళ్లికి ముందు పెళ్లి తర్వాత జీవితం గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. కొత్త పెళ్లి కూతురు ఇలాంటి కామెంట్లు చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు కరోనా సమయంలో దగ్గర అయినట్లు నేరగా రకుల్ యే తెలిపింది. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమే అని తెలుసుకుని ప్రపోజ్ చేసుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలని భావించినట్లు మూడేళ్ల క్రితమే చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్లకు ప్రేమ విషయాన్ని బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మూడు ముళ్ల వేయించుకోబోతున్న వార్తను కూడా ఎవరికీ చెప్పలేదు. సైలెంట్ గా చేసుకోవాలనుకోగా... వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Heroine Rakul Preet Singh Comments About After And Before Marriage Changes

ఏది ఏమైనా ఈ ప్రేమ పక్షలు.. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం రోజు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరి నడుమ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా గోవా వేధికగా రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ముందుగా సిక్కుల సంప్రదాయం ప్రకారం ఆనంద్ కారజ్ అనే పద్ధితిలో వీరి వివాహ వేడుక జరిగింది. ఇక ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారీ క్యూట్ కపుల్.

Heroine Rakul Preet Singh Comments About After And Before Marriage Changes

అయితే పెళ్లి జరిగి పది రోజులు దాటగా.. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేధికగా ఓ పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేధికగా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనకు సంబంధించిన మూడు అందమైన ఫొటోలను షేర్ చేసిన ఈమె... అందులో తన కాళ్లకు ఉన్న షూస్ హైలెట్ అయ్యేలా పెట్టింది. ముఖ్యంగా తన కాళ్లకు ఉన్న షూస్ ను చూపిస్తూ... పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కంఫర్ట్ విషయంలో ఏదీ మారలేదంటూ వివరించింది.

ఈ మూడు ఫొటోల్లో రకుల్ చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముందుగా వైట్ కలర్ షాట్ ఫ్రాక్ వేసుకున్న ఈమె స్టైలిష్ లుక్ లో ఫోజులు పెట్టింది. ఆ తర్వాత పెళ్లి డ్రెస్ లో షూస్ వేసుకుని కనిపించింది. లెహంగాను పైకి లేపి మరీ తన షూస్ చూపించింది. ఆ తర్వాత బ్లూక్ కలర్ డ్రెస్ లో కనిపించిన రకుల్.. పాపిట కుంకుమతో కనిపించింది. ఇలా పెళ్లికి ముందు పెళ్లి రోజు పెళ్లి తర్వాత ఫొటోలను షేర్ చేసి మరీ కంఫర్ట్ విషయంలో ఏమీ మారలేదంటూ స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X