టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు: ఏడున్న‌ర గంట‌ల‌పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను అలా.. ఈడీ విచార‌ణ‌లో.. !

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ రోజురోజుకు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వారికి ఇచ్చిన తేదీ ప్రకారం గంటల తరబడి విచారణకు హాజరవుతున్నారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ కేసు తెరపైకి రావడం అందరిని కాస్త కన్ఫ్యూజన్‌కు గురి చేసింది. 2017లోనే కేసు మొత్తం క్లోజ్ అయినట్లుగా టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత మళ్ళీ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. డ్రగ్స్ కొనుగోలు విషయంలో సెలబ్రెటీల బ్యాంక్ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ఏడాదిలో ఎవరెవరికి ఎందుకు డబ్బులు పంపారు అనే విషయాలపై గట్టిగానే ఆరా తీస్తున్నారు. ఇక ఈ రోజు ఈడీ విచారణలో పాల్గొన్న బాలీవుడ్, దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి ఏడు గంటల సుదీర్ఘమైన విచారణ అనంతరం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మర్చిపోతున్న సమయంలో..

మర్చిపోతున్న సమయంలో..

టాలీవుడ్ సినిమాలో ఇండస్ట్రీలో గత ఇదేళ్లుగా డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందని అనేక రకాల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు విచారణలోనే అనుమానాలు వచ్చిన స్టార్స్ అందరికి టెస్టులు కూడా నిర్వహించారు. గోళ్ళు, జుట్టు వంటి వాటిని కూడా సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం కూడా పంపారు. అనంతరం 2017లో కేసు గురించి అందరూ మర్చిపోతున్న సమయంలో హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగి బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది.

ముగిసిన ఛార్మి, పూరి విచారణ

ముగిసిన ఛార్మి, పూరి విచారణ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదివరకే ఈడీ అధికారులు కొంతమంది ప్రముఖ సెలబ్రెటీలకు అనుకున్న సమయంలో విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేయడమే కాకుండా హాజరుకావాల్సిన డేట్స్ ను కూడా ఇచ్చేశారు. గత రెండు రోజులుగా ఒక్కొక్కరుగా ఇన్వెస్టిగేషన్ కు సహకరించాడనికి ముందుకు వస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కౌర్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

 ముందుగానే విచారణకు వచ్చిన రకుల్

ముందుగానే విచారణకు వచ్చిన రకుల్

పూరి జగన్నాథ్, ఛార్మి గంటల తరబడి విచారణలో పాల్గొన్న అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారణకు సిద్దామయ్యింది. అయితే ఆమె సెప్టెంబర్ 6వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు అందించగా రకుల్ మాత్రం మూడు రోజుకు ముందుగానే విచారణలో పాల్గొంటానని చెప్పింది. ఆ తేదీ రోజు తనకు కురకపోవచ్చని అందుకే ముందుగానే వస్తానని శుక్రవారం ఆమె ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
ఏడు గంటల పాటు విచారణ

ఏడు గంటల పాటు విచారణ

ఇక ఈడీ విచారణలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ 7గంటల పాటు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిందట. అంతే కాకుండా ఆమె బ్యాంక్ ఎకౌంట్ డేటియిల్స్ కూడా చాలానే ఇచ్చిందట. ఈడీ అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేసిన తరువాత ఆమెను సాయంత్రం విడిచిపెట్టారు. ఇక విచారణ అనంతరం సైలెంట్ గా బయటకు వచ్చిన రకుల్ తన కారులో ఇంటికి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం రకుల్ పలు బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X