Rakul Preet Singh: అందమైన డ్రెస్సులో రకుల్ గ్లామర్ ట్రీట్.. దీని ముందు బికినీ లుక్ కూడా తక్కువే..
రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో తన అందంతో ఆకర్షణీయమైన నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ నటిగా తెలుగులోనే మొదట్లో మంచి విజయాలు అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు కొనసాగుతోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో గ్లామర్ తో రోజురోజుకు సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
డిఫరెంట్ సినిమాలతో: 1990 అక్టోబర్ 10న న్యూ ఢిల్లీలో జన్మించిన రకుల్ మొదట్లో మోడలింగ్‌లో వృత్తిని కొనసాగించి ఆ తరువాత నటనలోకి అడుగుపెట్టింది. వినోద ప్రపంచంలో ఆమె ప్రయాణం వివిధ చిత్ర పరిశ్రమలలో అమ్మడు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. రకుల్ 2009లో "గిల్లి" సినిమాతో చిత్ర పరిశ్రమలో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది.

తెలుగు సినిమాలతో పాటు: ఇక 2014లో వచ్చిన "వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్"తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ పడింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా రకుల్ అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. ప్రతీ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తెలుగు సినిమాతో పాటు తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా రకుల్ తనదైన ముద్ర వేసుకుంది. "తడయార తక్క," "తీరన్ అధిగారం ఒండ్రు," "NGK" వంటి తమిళ చిత్రాలలో ఆమె నటన ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.

దెబ్బ కొట్టిన పెద్ద సినిమాలు: తెలుగులో రకుల్ అగ్ర హీరోలతో కూడా అప్పుడప్పుడు ఛాన్స్ అందుకుంది కానీ ఆ సినిమాలు అంతగా క్లిక్ కాలేదు. ముఖ్యంగా స్పైడర్, కిక్ 2, మన్మధుడు వంటి సినిమాలు ఆమె కెరీర్ ను కొంత దెబ్బ తీశాయి. అయినప్పటికీ అమ్మడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది. హిందీ చిత్ర పరిశ్రమలో, ఆమె "యారియాన్" చిత్రంతో తన అరంగేట్రం చేసింది. "దే దే ప్యార్ దే", "మర్జావాన్" మరియు "సిమ్లా మిర్చి" వంటి చిత్రాలతో అక్కడ మంచి క్రేజ్ అందుకుంది.

ఆ రకంగా బిజినెస్ చేస్తూ: రకుల్ ప్రీత్ సింగ్ కేవలం సినిమా హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగంలో కూడా మంచి గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఆమెకు మంచి పట్టు ఉండడంతో కొన్ని కాస్ట్లీ ఏరియాలలో స్పెషల్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ రూట్లో ఆమె భారీగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో కూడా రకుల్ అప్పుడప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
మరోసారి గ్లామర్ డోస్ పెంచుతూ: ఇక రీసెంట్గా రకుల్ ప్రీత్ కు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక లాంగ్ ఫ్రాక్ లో అమ్మడు గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. ఇక ఎద అందాలు మరింత హైలైట్ అయ్యే విధంగా ఆమెకు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
గతంలో బికినీలో కూడా కనిపించిన రకుల్ ఈసారి మాత్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో గ్లామర్ బ్యూటీగా కనిపిస్తోంది అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి తన అందంతో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











