పాపం రకుల్ కూడా ఆ విషయంలో లొంగిపోవాల్సి వస్తోంది.. లేకుంటే ఆఫర్స్ రావట!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ ఎక్కువైంది. గత మూడేళ్ళ క్రితం చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్న ముద్దు గుమ్మలు ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ అవకాశాలకు ఎసరు పెట్టేశారు. వారి డామినేషన్ కి ఒకప్పుడు మంచి సక్సెస్ లో ఉన్న వారు రెమ్యునరేషన్ విషయంలో లొంగిపోవాల్సి వచ్చింది. ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు రకుల్ కూడా చేరింది.

ఆ సినిమాలతో డౌన్ ఫాల్..
రకుల్ ప్రీత్ సింగ్ లక్కేమిటో గాని ఒకసారి పట్టిందంటే వదలదు. మరోసారి దూరమయ్యింది అంటే ఎంత కష్టపడిన ఫలితం దక్కదు. ఆమెపై అప్పట్లో కొన్ని పెద్ద సినిమాలు చూపిన ప్రభావం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా మహేష్ స్పైడర్, రవితేజ కిక్, నాగార్జున మన్మథుడు 2 వంటి సినిమాలు రకుల్ కెరీర్ ని డౌన్ ఫాల్ అయ్యేలా చేశాయి.

పూజా హెగ్డే, రష్మీక డామినేషన్..
సక్సెస్ లో ఉన్నప్పుడు కోటికి పైగా డిమాండ్ చేసిన రకుల్ అగ్రనటిగా సౌత్ లో చక్రం తిప్పింది. అయితే వరుస అపజయాలతో పాటు ఆమె ఎంచుకున్న పాత్రలు కూడా నెగెటివ్ కామెంట్స్ అందుకున్నాయి. ఇకపోతే ఇతర హీరోయిన్స్ డామినేషన్ కూడా ఈ మధ్య ఎక్కువైంది. ముఖ్యంగా పూజా హెగ్డే, రష్మీక మందన్నలు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు.

రెమ్యునరేషన్ విషయంలో..
ఇక మరికొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే చిన్న ఆఫర్స్ అయినా కూడా వదులుకోకుండా మంచి సినిమాలను చేయాలని డిసైడ్ అయ్యింది. ఇక వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అందుకే రెమ్యునరేషన్ విషయంలో రకుల్ లొంగక తప్పలేదు.

ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రకుల్ ఇప్పుడు క్రిష్ సినిమా కోసం అంతకంటే తక్కువ తీసుకుంటున్నట్లు టాక్. క్రిష్ సినిమాలు కొన్నిసార్లు సక్సెస్ కాకపోయినా కూడా అందులోని పాత్రలు జనాలకు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే రకుల్ ప్రీత్ తగ్గాల్సి వచ్చింది. ఎలాగైనా సక్సెస్ అందుకొని మళ్ళీ బిజీ అవ్వాలని ఆశపడుతోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











