Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వ్యాపారంలో దారుణంగా నష్టపోయిన రకుల్ ప్రీత్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?
గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కేవలం సినిమాలతోనే కాకుండా ఆ ఆమధ్య పలు వ్యాపారులతో కూడా మంచి ఆదాయాన్ని వెనకేసుకుంది. పాతికేళ్ల వయసులోనే మంచి బిజినెస్ లతో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన రకుల్ మొన్నటివరకు దారుణంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆమె నష్టపోయినా కూడా సంస్థలో పని చేసిన వారిని ఏ మాత్రం విడిచిపెట్టలేదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు చేదు అనుభవాలపై రకుల్ స్పందించింది.
హిందీలో బిజీగా..
గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న అమ్మడు ఎలాగైనా నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందుకోవాలని అనుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో ఆమె గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన విషయం తెలిసిందే. హిందీలో మేడే సినిమాతో పాటు జాన్ అబ్రహం ఎటాక్ అలాగే సర్దార్ అండ్ గ్రాండ్సన్ అనే మరో సినిమా చేస్తోంది.
ఇటీవల చెక్ సినిమాతో..
మన్మథుడు 2 తరువాత ఫామ్ కోల్పోయిన రకుల్ చెక్ సినిమాతో నిలదొక్కుకోవాలని ట్రై చేస్తోంది. ఆ సినిమా మిక్సీడ్ టాక్ తో ముందుకు వెలుతోంది. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమాను చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక రకుల్ చెక్ సినిమాలో గ్లామరస్ గా కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న లాయర్ పాత్రలో నటించింది.
రకుల్ వ్యాపారంలో నష్టాలు
అయితే రకుల్ హీరోయిన్ గా క్లిక్కయిన తరువాత F45 పేరుతో ఫిట్నెస్ సెంటర్స్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో అలా క్లిక్కయ్యిందో లేదో వెంటనే వైజాగ్ లో మరో బ్రాంచ్ ను ఓపెన్ చేసింది. ఇక ఆమె ఫిట్నెస్ సెంటర్స్ సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో కరోనా లాక్ డౌన్ వలన మొన్నటివరకు బాగా నష్టాలు ఎదుర్కొందట.
ఇప్పుడు
ఇక లాక్ డౌన్ లో సంస్థలో పని చేసిన ఎంప్లాయిస్ ను ఏ మాత్రం విడిచి పెట్టకుండా వాళ్ళకు ఎప్పటిలానే జీతాలు ఇస్తూ వచ్చిందట. నా బిజినెస్ ను కరోనా మహమ్మారి నన్ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతూ.. చాలా కాలం తరువాత మళ్ళీ కష్టమర్స్ రాకతో పుంజుకున్నట్లు తెలిపింది. ఇప్పుడైతే.. యధావిధిగా ఎప్పటిలానే కొనసాగుతుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ వివరణ ఇచ్చింది.
సౌత్ లో కూడా బిజీ బిజీగా..
ఇక తెలుగులో రకుల్ ఇటీవల క్రిష్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. తమిళ్ లో ఇండియన్ 2లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రకుల్ శివకార్తీకేయన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. అయితే ఇండియన్ 2 క్యాన్సిల్ అయినట్లు కొన్ని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.