హీరోయిన్ రంభ కూతురును చూసారా?.. కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపేనట!
జనరేషన్ మారినా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోతారు. అలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా గూడు కట్టుకున్న హీరోయిన్ రంభ. అచ్చ తెలుగు విజయవాడ అందం. ఆమె అసలు పేరు విజయలక్ష్మీ. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1992 లో మలయాళ చిత్రం సర్గం ద్వారా ఈ భామ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమె పేరు విజయలక్ష్మీనే.
తెలుగులో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే ఇవివి ఇప్పటికే చాలామంది విజయలక్ష్మీలు ఉన్నారు.. ఈ పేరు వద్దు అని ఆమెకు రంభ అని నామకరణం చేసారు. అలా విజయలక్ష్మీ కాస్తా రంభగా మారింది. పేరు బలమో ఏమో కానీ.. రంభ పట్టిందల్లా బంగారంగా మారింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ .. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాకుండా పోయింది.

వరుస సినిమాలు, స్టార్ హీరోల సరసన రొమాన్స్.. టోటల్ గా అమ్మడి రేంజే మారిపోయింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జెడి చక్రవర్తి, జగపతి బాబు లాంటి హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ్ లో సైతం రజినీకాంత్, అజిత్, విజయ్, .. హిందీలో సల్మాన్ ఖాన్ తో సహా అందరితో నటించి మెప్పించింది. 90 వ దశకంలో అమ్మడు మిగతా హీరోయిన్లకు చెమటలు పట్టించింది. అందం, అభినయం.. అందాల ఆరబోత దేనికి తగ్గేదేలే అంటూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.
దాదాపు 100 సినిమాలకుపైగా నటించి మెప్పించిన రంభ.. 2010 లో బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ ను వివాహామాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కొన్ని షోస్ కు జడ్జిగా వ్యవహరించి అభిమానులకు దగ్గరగానే ఉంది. మధ్యలో దేశముదురు, యమదొంగ లాంటి సినిమాలో హాట్ ఐటెంసాంగ్స్ చేసి అదరగొట్టింది. ఇక ప్రస్తుతం రంభ కుటుంబం తో సహా విదేశాల్లో సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు తమ ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా రంభ షేర్ చేసిన ఫొటోల్లో అందరి చూపు ఆమె కూతురుపైనే పడింది. రంభకు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి. ఇక పెద్ద కూతురు పేరు లాన్య ఇంద్రకుమార్. ప్రస్తుతం ఈ చిన్నదాన్ని చూస్తే తల్లిని చూసినట్టే ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. యుక్తవయస్సులో లాన్య.. తల్లిని మించిన అందంతో అదరగొడుతోంది.
ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం లాన్య సొంతం అని చెప్పాలి. ప్రస్తుతం చదువు మీద దృష్టి పెట్టిన లాన్య .. పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కేవలం అందంలోనే కాదు.. తల్లి వాయిస్ లానే లాన్య వాయిస్ కూడా ఎంతో బావుంది. ఈ మధ్య ఒక షో లో సందడి చేసిన లాన్య .. తల్లి గురించి మాట్లాడుతూ షాక్ ఇచ్చింది. కళ్ళుమూసుకొని వింటే మాట్లాడేది ఎవరు రంభ.. ఎవరు లాన్య అని తెలుసుకోవడం కష్టమే అని అభిమానులు అంటున్నారు. మరి కూతురు ఎంట్రీ కోసం రంభ ఎలాంటి ప్రయత్నాలు మొదలుపెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











