Rambha: 47 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన రంభ.. హద్దు దాటి మరీ అందాల ఆరబోత
తనదైన నటన, అందచందాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా సందడి చేసి.. సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన హీరోయిన్ రంభ. చాలా కాలం పాటు దక్షిణాది భాషల్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. ఆ తర్వాత భర్తతో కెనడాలో సెటిల్ అయింది. అయితేనేం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ హీరోయిన్ రంభ కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్:టీనేజ్‌లో ఉన్నప్పుడే రంభ 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆరంభంలోనే అందం, అభినయంతో మెప్పించిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్‌లోని బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అలా సుదీర్ఘ కాలం హవాను చూపించింది.

ఆ భాషల్లోనూ సత్తా చాటేసి:సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన రంభ.. ఆ తర్వాత తమిళంలో చాలా చిత్రాలు చేసింది. అంతేకాదు, హిందీలోనూ అదిరిపోయే మూవీలతో నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇవి మాత్రమే కాదు.. కన్నడం, మలయాళం, బెంగాళీ, బోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది. తద్వారా ఫుల్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
అతడితో పెళ్లి.. కెరీర్ అలా:వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే రంభ.. బిజినెస్‌మ్యాన్ ఇంద్రకరణ్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఈ సుందరాంగి.. తమిళం, మలయాళంలో మాత్రం పలు చిత్రాల్లో కనిపించింది. కానీ, ఆ తర్వాత అంటే 2011 తర్వాత బిగ్ స్క్రీన్‌కు దూరం అయిపోయి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

కెనడాలోనే.. యాక్సిడెంట్:ఇంద్రకరణ్ పద్మనాథన్‌తో వివాహం జరిగిన కొంత కాలానికి రంభ కెనడా దేశంలోనే సెటిలైంది. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. అప్పటి నుంచి ఈ సీనియర్ హీరోయిన్ తన ఫ్యామిలీతోనే కలిసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తోంది. ఇక, కొన్ని నెలల క్రితమే రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. దీంతో ఈమె మరోసారి వార్తల్లోకి వచ్చింది.

సోషల్ మీడియా ద్వారానే:దాదాపు మూడు దశాబ్దాల పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో వెండితెరకు దూరంగా ఉంటోన్న హీరోయిన్ రంభ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

విదేశాల్లో ఉన్నా పద్దతిగా:సోషల్ మీడియా వాడకం పెరగడంతో చాలా మంది సీనియర్ హీరోయిన్లు అందులో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ హాట్ షోలు చేస్తున్నారు. కానీ, రంభ మాత్రం విదేశాల్లో ఉన్నా చాలా పద్దతిగానే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె డీసెంట్ ఫొటోలనే ఎక్కువగా షేర్ చేస్తుంది. కానీ, స్వతహాగా గ్లామరస్ హీరోయిన్ కావడంతో అప్పుడప్పుడూ ట్రీట్ ఇస్తోంది.

రంభ బోల్డు పిక్స్ వైరల్:గ్లామరస్ హీరోయిన్‌గా కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న రంభ.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో డీప్ నెక్ డ్రెస్‌ను వేసుకుంది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో కనిపిస్తూ కవ్విస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











