నా జీవితం అనుకున్నట్టుగా లేదు.. రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఇటు సౌత్, అటు నార్త్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ మంచి క్రేజ్ దక్కించుకుంది. తన చిత్రాలతో ఆకట్టుకుంటూ వస్తోంది. తను ఎలాంటి సినిమా చేసినా సరే అటు ఆడియెన్స్ నుంచి, ఇటు బాక్సాఫీస్ పరంగా మంచి రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంత సక్సెస్ ను చూస్తున్న ఈ స్టార్ హీరోయిన్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

రష్మిక మందన్న సినిమాలు..
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగులోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే కన్నడలో 'కిర్రిక్ పార్టీ' అనే చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గీతా గోవిందం, దేవదాస్, డియర కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప : ది రైజ్, ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతా రామమ్, వారసుడు, యానిమల్, పుష్ప 2 వంటి చిత్రాలతో టాలీవుడ్ లో చరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోయిన్ గా మారి ప్రస్తుతం దుమ్ములేపుతోంది.

Heroine Rashmika Madanna about his Life Lessons

రష్మిక మందన్న వరుస హిట్స్..
అయితే రష్మిక మందన్న కేవలం ఏడాదిలోనే రేర్ ఫీట్ ను సాధించింది. దాదాపు 3000 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి వంగ - రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్, సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ఫ 2 : ది రూల్', బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ నటించిన 'ఛావా' చిత్రాలతో వరుసగా బ్లాక్ బాస్టర్ అందుకుంది. దీంతో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకోండి..
అయితే రష్మిక మందన్న తాజాగా తన జీవిత పాఠాలను కొన్ని అభిమానులతో పంచుకుంది. రీసెంట్ గా తను ఇలా చెప్పిన మాటలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అసలు చిన్నప్పుడు తన డ్రీమ్ నటిగా మారడం కాదని, తన ఆలోచనలు వేరేలా ఉండేవని చెప్పింది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. నటిగా తను ఎదగడానికి కంటే ముందు కూడా ఎంతో ఒత్తిడిని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఇక ఎవ్వరికీ ఏదీ శాశ్వతం కాదని, తను ఎంతో సక్సెస్, ఒత్తిడి చూసినా అది గుర్తుపెట్టుకుంటనని చెప్పింది. తాజాగా తన మోటీవేషనల్ వర్డ్స్ ఆకట్టుకుంటున్నాయి.

నెక్ట్స్ రాబోయే చిత్రాలివే..
రష్మిక మందన్న చివరిగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన 'సికిందర్' అనే చిత్రంలో నటించి అలరించింది. ఇక నెక్ట్స్ తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన 'కుబేరా' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్, థామా అనే చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X