Rashmika Mandanna కాబోయే భర్త VDనే... ఇన్నాళ్లకు అసలు నిజం బయటపెట్టిన రష్మిక!

కన్నడ భామ రష్మిక మందన్న, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని వార్తలు వస్తునే ఉన్నాయి. దానికి కారణం వీరు ఇచ్చే హింట్స్. సోషల్ మీడియాలో వీరు పెట్టే పోస్టులు.. వీరు సీక్రెట్ లవ్ మెయిన్ టెయిన్ చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. ఇక దీనితో వీరిపై పెళ్లి, ప్రేమ రూమర్స్ పుట్టుకువచ్చాయి. ఆ విషయం పక్కనపెడితే.. అందరూ అనుకున్నట్లుగానే VDనే తనకు కాబోయే భర్త అంటూ రష్మిక పోస్ట్ చేసింది. ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

ప్రేమ వరకు వెళ్లి బ్రేకప్...:నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కన్నడంలో కిర్రాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఈ భామ.. మరి ఏమైందో తెలియదు వీరి ప్రేమ బ్రేకప్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన వీరి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయిపోయింది. అయితే అప్పటికే రష్మిక తెలుగులో ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం అనే సినిమాలో నటించింది.

Heroine Rashmika Mandanna conforms Vijay Devarakonda aka VD Will Be The Her Husband Full Details Here

విజయ్ దేవరకొండతో ప్రేమలో...:అయితే వీరి బ్రేకప్ కు కారణం విజయ్ దేవరకొండ అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక విజయ్ దేరవకొండతో క్లోజ్ గా మూవ్ అవుతూ వచ్చింది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో వీరు ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. అయినా వీరి మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం వీరు ఒకే లొకేషన్లో ఉండి ఫోటోలు దిగి.. వేరుగా అప్లోడ్ చేయడం. ఇవి కనిపెట్టిన నెటిజన్లు.. వీరు ప్రేమలో ఉన్నట్లు భావించారు.

కలిసి ట్రిప్పులకు, షికార్లకు...:అంతే కాదు.. కలిసి ట్రిప్పులకు వెళ్లడం, విజయ్ షర్ట్స్, కళ్లాద్దాలు రష్మిక ధరించడం.. విజయ్ ఇంట్లోనే రష్మిక పండగలు సీక్రెట్ గా జరుపుకోవడం ఇవన్నీ వీరు ప్రేమలో ఉన్నట్లు నెటిజన్స్ అనుకున్నారు. దీంతో వీరి ఎఫైర్ గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తునే ఉంది. దీనిపై విజయ్ దేవరకొండ పలుమార్లు స్పందించాడు. అలాంటివి ఏవి లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. రష్మిక మాత్రం ఫన్నీ సమాధానాలు చెప్పి తప్పుకుంటూ ఉంటుంది.

Heroine Rashmika Mandanna conforms Vijay Devarakonda aka VD Will Be The Her Husband Full Details Here

VDనే కాబోయే భర్త...:తాజాగా వీరి రిలేషన్ మీద రష్మిక మందన్నా క్లారిటీ ఇచ్చేసింది. VD నే నాకు కాబోయే భర్త అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక మందాన ఢిల్లీ ఫ్యాన్స్ ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టగా.. అది వైరల్ గా మారింది. అందులో రష్మికకు కాబోయే భర్త VD లా ఉండాలి. నా అర్థం VD అంటే వెరీ డేరింగ్... అలాగే మేము రష్మికను క్వీన్ అని పిలుచుకుంటాము. కాబట్టి అతడు కింగ్ అయి ఉండాలి అంటూ పోస్ట్ పెట్టారు.

Heroine Rashmika Mandanna conforms Vijay Devarakonda aka VD Will Be The Her Husband Full Details Here

కన్ఫార్మ్ చేసిన రష్మిక:ఈ పోస్ట్ కు రష్మిక మందాన రియాక్ట్ అయింది 'అవును ఇది వాస్తవం' అని కామెంట్ చేసింది. విజయ్ దేవరకొండను షార్ట్ గా VD అని కూడా పిలుస్తారనే విషయం తెలిసిందే. ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థంలోనే ఆ కామెంట్ చేశారని తెలుస్తోంది. అది తెలిసి కూడా రష్మిక VD నే నాకు కాబోయేవాడని ఒప్పుకుందని తెలుస్తోంది. దీంతో రష్మిక నేరుగా విజయ్ దేవరకొండతో తన ఎఫైర్ కన్ఫర్మ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక త్వరలోనే పెళ్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X