Rashmika Mandanna: సైలెంట్ గా వెళ్లి అక్కడే ఫిక్సైపోతుందా.. బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న క్రష్మిక!
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీత గోవిందం సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ కూర్గ్ భామ.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఓ సినిమా ఇలా పూర్తవగానే మరో సినిమాలో అవకాశం దక్కించుకుంటోంది. ఎప్పటికప్పుడు ఛాన్సులు కొట్టేస్తూ.. స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది.
ముఖ్యంగా అగ్రహీరోల సరసన నటిస్తూ అందరిచేత ఆహా అనిపించుకుంటున్న రష్మిక మందన్నా... బాలీవుడ్ లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది. తాజాగా రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. అనూహ్య స్పందన వస్తోంది. అలాగే ఈ చిత్రంలోని పాటలకు కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా విడుదల కూడా కాకముందే రష్మిక మందన్నా మరో అవకాశాన్ని అందుకుంది.

బాలీవుడ్ మిడ్ రేంజ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి నటించేందుకు రష్మిక మందన్నా ఓకే కూడా చెప్పేసిందట. ఉరి సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్.. వరుసగా ఛాన్సులు అందుకుంటూ అనేక సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే సారా అలీ ఖాన్ తో కలిసి జర హట్కే జర బచ్కే సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఆ ఊపుతోనే నేషనల్ క్రష్ రష్మికతో నటించి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఛవా అనే హిస్టారికల్ పాన్ ఇండియా సినిమాలో రష్మిక, విక్కీ కౌశల్ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక కనిపించనున్నారు. విక్కీ కౌశల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జయసింగ్ రావు రాసిన మరాఠీ నవల ఆధారంగా రూపొందిస్తున్నారట.

రాహుల్ జనార్దన్ యాదవ్ ఈ పీడియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు పూర్తి కాగా.. అక్టోబర్ 16వ తేదీ నుంచి సినిమా షూటింగ్ ప్రాంరంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇలా రష్మిక మందన్నాకు వరుసగా బాలీవుడ్ లో ఆఫర్లు వస్తే ఇక అక్కడే సెటిల్ అయ్యే అవాకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ నేషనల్ క్రష్ అన్ని చోట్లా ఉంటుందా.. లేక వరుసగా ఛాన్సులు దక్కించుకొని బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోతుందా అనేది.


Click it and Unblock the Notifications











