Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో రష్మిక.. సమ్ థింగ్ స్పెషల్.. త్వరలో చెప్తానంటూ పోస్ట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే వీరి మధ్య ఏదో ఉందంటూ గత కోన్నేళ్లుగా వార్తలు వస్తునే ఉన్నాయి. దానికి తగ్గట్లు వీళ్లు కూడా అలాగే హింట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. రష్మిక పోస్టుతో మరోసారి విజయ్ సినిమాలో రష్మిక నటి్స్తుందనే విషయం తేలిపోయింది. ఆ సినిమా ఏంటి.. పోస్టు ఏమని చేసిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషి అనే సినిమా చేశాడు. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ మీదనే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి.. సినిమాపై అంచనాలు నెలకోల్పింది. తొలిసారిగా విజయ్ దేవరకొండ.. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకుర్ తో జతకట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పక్క హిట్ అవుతుందనే అంచనాతో ఉన్నాడు రౌడీ హీరో.

ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మిక మందన్నా అనుకున్న సంగతి తెలిసిందే. కానీ ఏమైందో తెలియదు.. ఈ సినిమా నుంచి రష్మిక ఔట్ అని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. విజయ్ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఫ్యామిలీ స్టార్ సినిమాలోనే నటిస్తున్నట్లు కన్ఫార్మ్ అయింది. అదేంటి అనుకుంటున్నారా...
అయితే అసలు విషయానికి వస్తే... రౌడి హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇక ఈ సినిమాకు పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సాలీడ్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఇప్పుడు రష్మిక కూడా నటిస్తుందనే విషయం బయటపడింది.

ఈ సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు పంచుకుంది. అదే లొకేషన్ కి సంబందించిన మరొక పోస్ట్ ను హీరోయిన్ రష్మిక మందన్న తన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో.. అసలు విషయం బయటపడింది. షూటింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది నేషనల్ క్రష్. దీంతో తను ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

అలా రష్మిక విజయ్ సినిమాలో నటిస్తుందనే విషయం బయటపడింది. రష్మిక చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతానికి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో సినిమాని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి ఇది వాయిదా పడొచ్చు అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మరి మృణాల్, విజయ్, రష్మిక కాంబో ఎలా ఉంటుందోనని.


Click it and Unblock the Notifications











