Rashmika Mandanna ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా? సౌత్‌లో టాప్ లేపిన రష్మిక మందన్న!

కన్నడ భామ రష్మిక మందన్న ఇండియన్ క్రష్‌గా మారిపోయింది. ఆమె నటించిన పుష్పకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కడంతో ఓవర్‌నైట్‌లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. దాంతో హిందీ సినిమా ఆఫర్లు వెల్లువెత్తడంతో ప్రస్తుతం దక్షిణాది వైపు చూపు చూసే సమయమే లేకపోయిందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే రష్మిక మందన్న తాజా ఆడిట్ ప్రకారం భారీగా ఆస్తులు కూడబెట్టందనే వార్తలు ముంబై మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే రష్మిక మందన్న కెరీర్, వ్యక్తిగత జీవితం, నికర ఆస్తుల వివరాల్లోకి వెళితే..

కన్నడలో తొలి చిత్రంతోనే..

కన్నడలో తొలి చిత్రంతోనే..

కన్నడ సినీ పరిశ్రమలో కిరిక్ పార్టీ సూపర్ హిట్ కావడంతో తొలి సినిమాతోనే రష్మిక మందన్నకు అదృష్టం తలుపుతట్టింది. ఆ తర్వాత కన్నడలో ఆమెకు మంచి ఆఫర్లు రావడంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. కన్నడలో భారీ అవకాశాలు అందుకొంటున్న సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి.

తెలుగులో టాప్ హీరోలతో

తెలుగులో టాప్ హీరోలతో

టాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్లు వచ్చినా పట్టించుకోకుండా.. ఛలో సినిమాతో నాగశౌర్యతో జతకట్టే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ఛలో కూడా సూపర్ హిట్ కావడంతో తెలుగులో వెనుకకు తిరిగి చూసుకొనే అవకాశం లేకపోయింది.

ఛలో తర్వాత నాగార్జున, నానితో దేవదాస్, విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేర్చాయి.

బాలీవుడ్‌లో అమితాబ్‌తో

బాలీవుడ్‌లో అమితాబ్‌తో

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా హిట్ కావడంతో బాలీవుడ్‌లో కూడా వరుస అఫర్లు వెల్లువెత్తాయి. హిందీలో అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై, సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను చిత్రాల్లో నటించింది. అయితే బాలీవుడ్ చిత్రాలు అంతగా విజయవంతం కాకపపోయినా.. రష్మికకు ఆఫర్లు పలకరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌తో వస్తున్న యానిమల్ సినిమాలోను పుష్ప చిత్రంలో నటిస్తున్నది.

సినిమాల్లోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా

సినిమాల్లోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా

రష్మిక కేవలం సినిమాలో కాకుంబా బ్రాండ్ ప్రమోషన్స్, వ్యాపార ప్రకటనల్లో కనిపిస్తూ భారీగా సొమ్ము చేసుకొంటున్నది. టాప్ బ్రాండ్స్ అంబాసిడర్‌గా భారీ అవకాశాలను అందుకొంటున్నది. అంతేకాకుండా ఇటీవల పలు కంపెనీలకు సంబంంధించిన వ్యాపార ప్రకటనల్లో కనిపించింది. దాంతో భారీగా ఆదాయాన్ని అందుకొంటున్నది. ప్రస్తుతం ఏడాదికి 125 కోట్లకుపైగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు బిజినెస్ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రష్మిక మందన్న నికర ఆస్తుల విలువ

రష్మిక మందన్న నికర ఆస్తుల విలువ

దక్షిణాదిలోను, బాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సంపన్న నటుల జాబితాలో టాప్ స్థానానికి ఎగబాకిందని సమాచారం. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ కనీసం 300 కోట్ల నుంచి 400 కోట్ల మధ్య ఉంటుందనేది తాజా టాక్. ప్రస్తుతం వెంకీ కుడుముల చిత్రంలో నితిన్ సరసన నటించేందుకు అంగీకరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X