Rashmika Mandanna: రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్... కేంద్రానికి అమితాబ్‌ కంప్లైంట్.. నేషనల్ క్రష్ రియాక్షన్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దానికి కారణం ఆమె డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికీ ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై కేంద్రం యాక్షన్ తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఫేక్ వీడియోపై రష్మిక మందన్నా కూడా స్పందించింది. తన ఇన్ స్టావేదికగా ఓ స్టోరీ పెట్టింది. అసలు ఆమె రియాక్షన్ ఏంటి... అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుతం రష్మిక మందన్నాకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్‌ చేసినట్లు ఎవరో మార్ఫింగ్ చేశారు. ఈ డీప్‌ఫేక్‌ వీడియో అయితే సోషల్ మీడియాను ప్రస్తుతం షేక్ చేస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు, రష్మిక అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చాన్ సైతం.. ఆ వీడియోపై స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Heroine Rashmika Mandanna React on Her Deepfake Video Viral Full Details Here

ఇలాంటి ఘటనపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని కేంద్రానికి అమితాబ్ డిమాండ్‌ చేశారు. ఇక ఆయన డిమాండ్ తో కేంద్ర ఐటీ విాభాగం కూడా రియాక్ట్ అయింది. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాలదే బాధ్యత అని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య.. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల కట్టడికి సోషల్ మీడియాలదే బాధ్యత అంటూ రాసుకువచ్చారు.

Heroine Rashmika Mandanna React on Her Deepfake Video Viral Full Details Here

ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్‌ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. ఇక 2023 ఏప్రిల్‌ నెలలో జారీ చేసిన ఐటీ నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు ఏ యూజర్‌ కూడా నకిలీ, తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా చూసుకోవాలని తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తిస్తే ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం.. 36 గంటల్లో దానిని డిలీట్ చేయాలి.. లేకపోతే.. వారిని కోర్టుకు లాగొచ్చు అంటూ తెలిపారు.

ఇక ఈ వీడియోపై రష్మిక కూడా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తన ఇన్ స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ ను రాసుకువచ్చింది. ఈ వీడియో తనను చాలా భాదించిందని చెప్పుకువచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తన డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తుంది... ఇది నాకు మాత్రమే భయాన్ని ఇవ్వడం లేదు.. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూసి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఒక మహిళగా, నటిగా.. నాకు మద్ధతు ఇచ్చిన కుటుంబం, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అంటూ రాసుకువచ్చింది.

ఇక తను స్కూల్లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరిగితే దీన్ని ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేను అంటూ ఎమోషల్ అయింది. ఇక ప్రస్తుతం రష్మిక రియాక్షన్ కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను కొందరు ఆకతాయిలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ది అని తెలుస్తోంది. ఆమె వీడియోను.. రష్మిక ఫేస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X