Rashmika Mandanna ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ సంచలన పోస్ట్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసింది. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. జస్ట్ మిస్ చావు నుంచి తప్పించుకున్నా అంటూ రాసుకువచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టిసిన ఈ బ్యూటీ.. నేషనల్ క్రష్ అయిపోయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలతో దుమ్ములేపుతుంది. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ బ్యూటీ రణబీర్ కపూర్ తో కలిసి ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించింది.

ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2 సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో దసరా ఫేం దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇవే కాకుండా రష్మిక చేతిలో హిందీ సిినిమాలు, తెలుగు, తమిళ సినిమాలు ఉన్నట్లు సమాచారం.
వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా మారిన ఈ బ్యూటీ ఇటీవల ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సైతం రష్మిక గురించి ఓ స్పెషల్ ఆర్టికల్ రాసుకువచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్నాకు దగ్గిన అరుదైన గౌరవానికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు విషెష్ తెలిపారు. విజయ్ దేవరకొండ కూడా సపోర్ట్ చేసి విషెష్ తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ నేషనల్ క్రష్.. తాజాగా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
రష్మిక మందన్నా ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఉన్నట్లుండి రష్మిక పెట్టిన పోస్ట్ చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అంతగా అభిమానులు కలత చెందేట్లుగా రష్మిక ఏం పోస్ట్ పెట్టారంటే... కొద్దిలో చావు నుంచి ఎలా తప్పించుకుందో రాసుకొచ్చింది. రష్మిక తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిందని ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందని తెలుస్తోంది.
అదే ఫ్లైట్ లో రష్మికతోపాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉంది. వీరిద్దరు కలిసి ఫ్లైట్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది నేషనల్ క్రష్. అందులో "ఈరోజు మేము ఈ విధంగా చావు నుంచి తప్పించుకున్నాము" అంటూ రాసుకొచ్చింది. దీంతో రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నేషనల్ క్రష్ పోస్టుతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం రష్మిక, శ్రద్ధా దాస్ కలిసి ప్రయాణిస్తోన్న విమానం ముంబై నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తోందని తెలుస్తోంది. అయితే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య కారణం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత తిరిగి మళ్లీ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఇదే విషయాన్ని రష్మిక పోస్ట్ చేసింది. ఇటీవలే ఆమె యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్ నటించారు. ఇక ఈ బ్యూటీ నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్.


Click it and Unblock the Notifications











