Rashmika: బంపర్ ఆఫర్స్ కొట్టేసిన రష్మిక... ఈ బ్యూటీ లైనప్ శ్రీలీలను మించిపోయిందిగా!
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో ఆమె దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్ లో బిజి బిజిగా ఉన్న శ్రీలీల లైనప్ ను... రష్మిక మందన్న లైనప్ మించిపోయిందని చెప్పవచ్చు. దాదాపు ఆమె చేతిలో తెలుగు,తమిళ్, కన్నడ సినిమాలే కాదు.. బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ హీరోయిన్ చేతిలో ఉన్న సినిమాలు ఏంటో ఓసారి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజిగా మారిపోయింది. నాగాశౌర్య నటించిన చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక అక్కడి నుంచి ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

బాలీవుడ్ సినిమాల్లోనూ...:ఇక రష్మిక చేతిలో ఉన్న సినిమా విషయానికి వస్తే... సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరో. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక ఆమె పాత్ర కూడా ఈ సినిమాలో స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.
శ్రీలీల ఛాన్స్ కొట్టిస్తూ...:ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2తో మరింత సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాలోనూ రష్మికనే హీరోయిన్. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా... గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారు. కానీ రష్మిక మందన్నా ఫిక్స్ అయింది.

క్రేజీ ప్రాజెక్ట్సులో... :ధనుష్ 51వ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అయింది. ఇక మరోవైపు రవితేజ, గోపిచంద్ మలినేని సినిమాలోనూ రష్మికనే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక లేడీ ఒరియేంటెడ్ మూవీ రెయిన్ బో. ఈ చిత్రం ద్విభాష మూవీగా తెరకెక్కుతోంది. మరో లేడి ఒరియేంటెడ్ మూవీ రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనూ రష్మిక నటించనుంది.

రష్మిక చేతిలో 7 సినిమాలు:ఇక మొత్తంగా రష్మిక చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీలీలను రష్మిక మించిపోయిందని అంటున్నారు నెటిజన్స్. శ్రీలీల వదిలేసుకున్న చిత్రాలన్నీ... రష్మిక ఛాన్స్ కొట్టేస్తుంది. దీంతో వచ్చే ఏడాది వరకు రష్మిక చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. దీంతో రష్మిక లైనప్ మామూలుగా లేదని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











