నా ఆశ, నా శ్వాస నీ కోసమే.. రేణు దేశాయ్ సెల్ఫీ వీడియో వైరల్
Renu desai: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ సతీమణి, హీరోయిన్ రేణు దేశాయ్ (Renu Desai) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత పిల్లలు ఆద్య, అకీరా నందన్ (Akira Nandan) బాధ్యత తీసుకుంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తాజాగా హీరోయిన్ రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం వీడియో పోస్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్ రెండు సినిమాల్లో నటించింది. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జోడిగా నటించారు రేణు దేశాయ్. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ సహజీవనంగా మారింది. ఆ తరువాత పెళ్లి పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి బద్రి చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో పవన్ , రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారట. సహజీవనం చేశాక, అకిరా పుట్టాక పెళ్లి చేసుకున్నారు.

పవన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ ఇండస్ట్రీకి దూరమైంది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే... రేణు దేశాయి.. పవన్‌తో తప్ప వేరే హీరోతో నటించలేదు. అయినా ఆమె ఎంతో పాపులర్టీ సంపాదించుకుంది. ఆమె ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అయినా.. విడాకుల తీసుకున్న రేణు దేశాయి. ఇక ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ మ్యాటర్స్ ను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు కూడా .. జంతువుల కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నిత్యం పేదలు, మూగ జీవుల రక్షణ, వైద్యం కోసం విరాళాలు అందిస్తూనే ఉంటుంది. అలాగే..మూగ జీవుల సంరక్షణ కోసం రేణు దేశాయ్ ఆమె పెద్ద ఎత్తున విరాళాలను కూడా సేకరిస్తుంటుంది. మూగ జీవుల సంరక్షణ కోసం పని చేసే స్వచ్చంద సంస్థలకు సాయం చేస్తుంటుంది. నోరులేని జీవాల పట్ల తన ప్రేమను చాటుకుంటుంటారు.
ఇదెలా ఉంటే.. తాజాగా హీరోయిన్ రేణు దేశాయ్ మీడియో నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే. అనే సాంగ్ పెట్టి సెల్పీ వీడియో తీసింది. ఈ క్రమంలో రేణు దేశాయ్ చేసింది కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో పోస్టు చేస్తూ.. చాలామంది దృష్టిలో నేను ఎవరినంటే? అంటూ.. సింగిల్ పేరెంట్. విడాకులు తీసుకున్న మహిళ. పెద్దగా నవ్వే మహిళ, పురుష ప్రపంచంలో నిబంధనలతో జీవించే స్త్రీ. ఏ విషయానైనా ప్రశ్నించే సామర్థ్యం ఉన్న స్త్రీ. మగవాడి ఆసరా లేకుండా తన పిల్లలను పెంచే తల్లి. ఖచ్చితమైన అభిప్రాయం కలిగిన స్త్రీ. ఒక మహిళ మగవారి ప్రమేయం లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలదు. సమాజంలోని అసమంజసమైన పితృస్వామ్య డిమాండ్లకు అనుగుణంగా ఇష్టపడని స్త్రీ.' అంటూ షాకింగ్ పోస్టు పెట్టింది.


Click it and Unblock the Notifications











