Sai Pallavi: స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి రొమాన్స్... అన్నంత పని చేసిందిగా!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయిపోయింది. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ కొడుకు జనైద్ ఖాన్ తో ఓ సినిమాలో నటిస్తుంది. జునైద్ తో కలిసి జపాన్ లో సందడి చేసింది. స్నో ఫెస్టివల్ లో షికార్లు చేసింది. దీంతో వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు వివరాల్లోకి వెళితే...

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న తండేల్ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తుంది. వీరికాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా లీక్ అయ్యాయి.

Heroine Sai Pallavi Bollywood Entry With Star Hero Aamir Khan Son Junaid Khan News Goes Viral

ఇటీవలే తండేల్ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోపాటు సాయి పల్లవి హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె హిందీలో ఓ మూవీ చేయనుందని టాక్ వినిపిస్తుంది. అది కూడా ఓ స్టార్ హీరో తనయుడికి జోడిగా నటిస్తుందట ఈ నేచురల్ బ్యూటీ. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ... సాయి పల్లవి బాలీవుడ్ మూవీపై క్లారిటీ వచ్చేసింది.

బీటౌన్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ జపాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ మధ్యలో అక్కడి స్నో ఫెస్టివల్. (మంచు పండగ)లో సందడి చేశారు ఈ జంట. ఈ సందర్భంగా తీసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఫీక్స్ అయినట్లు తెలుస్తోంది.

Heroine Sai Pallavi Bollywood Entry With Star Hero Aamir Khan Son Junaid Khan News Goes Viral

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అతని మొదటి సినిమా 'మహారాజ్' విడుదలకు సిద్ధంగా ఉండగా... ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో జునైద్ తో సాయి పల్లవి రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. జపాన్ లో షూటింగ్ జరుపుకుంటుండగా.. షూటింగ్ విరామంలో సాయి పల్లవి, జునైద్ ఖాన్ కలిసి అక్కడి మంచు పండగలో పాల్గొన్నారు. ప్రస్తుతం వారి ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. తెలుగులో తండేల్ చిత్రం బిజీగా ఉంది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ ప్రాజెక్టు చేస్తుంది. ఇప్పుడు అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాలో నటిస్తుంది. అలాగే నితేశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణం సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X