Sai Pallavi: ఆ దర్శకుడితో సీక్రెట్ పెళ్లి... ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన సాయి పల్లవి

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. అందాల ఆరబోత లేకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాల్లో నటిస్తూ.. అందరినీ మెప్పిస్తోంది. ఇక సాయి పల్లవి గురించి గత కొద్ది రోజులుగా పెళ్లంటూ ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సాయి పల్లవి ఎట్టకేలకు స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ అసలు విషయం బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే....

మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలించింది. ఇందులో లెక్చరర్ పాత్రలో సాయిపల్లవి నటన అద్భతం అనిచెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి కాళి అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాకు కూడా మంచి పేరు లభించింది. ఈ చిత్రం తెలుగులో హే పిల్లగాడా పేరుతో డబ్ అయింది.

Heroine Sai Pallavi Clarity about Her Marriage Rumors Full Details Here

ఇక తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా సాయి పల్లవి నటించింది. తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. చివరగా ఈ భామ గార్గి అనే చిత్రంలో నటించింది.

ఇక సాయి పల్లవి గురించి గత కొద్ది రోజులుగా ఓ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవి ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుందని అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అంతే కాదు... ఫోటోస్ వైరల్ గా సృష్టించారు. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి వస్తవం లేదని తెలుగు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఆ ప్రచారం చేస్తూనే వచ్చారు.

Heroine Sai Pallavi

ఇక ఆ పెళ్లి రూమర్స్ పై తాజాగా సాయి పల్లవి స్పందించింది. త‌న పెళ్లిపై వ‌చ్చిన రూమ‌ర్స్‌పై సాయిపల్లవి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది. అందులో ... నిజం చెప్పాలంటే నేను రూమర్స్ ను పెద్ద‌గా పట్టించుకోను, కానీ అవి కుటుంబం లాంటి నా స్నేహితుల గురించి అయిన‌ప్పుడు నేను మాట్లాడాలి. నా సినిమా పూజలో దిగిన ఒక ఫొటోనీ క్రాప్ (క‌ట్) చేసి దానిని దురుద్దేశంతో పెయిడ్ అకౌంట్స్‌ ప్రచారం చేస్తున్నాయి. నేను నా పనికి సంబంధించి మంచి విషయాలు పంచుకునప్పుడు ఇలాంటి పనికి మాలిన వేషాలు చూసి బాధ కలుగుతుంది. ఇలా ఇబ్బంది కలిగించడం చాలా విచారకరం... అంటూ సాయి ప‌ల్ల‌వి రాసుకొచ్చింది.

Sai Pallavi Clarity On Marriage Rumours

అయితే అసలు విషయం ఏమింటంటే... సాయి పల్లవి.. శివకార్తికేయన్ తో కలిసి 'SK21' అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకుడు కాగా... ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం జరుపుకుంది. అయితే ఈ ఈవెంట్‌లో చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి కూడా మెడలో దండలు వేసుకుని ఫొటోలు దిగారు. అయితే ఈ ఫొటోను కొందరు నెటిజన్లు సగం వరకు క్రాప్​ చేసి.. ఆమె పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X