twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Pallavi Net Worth: ఎంతో తెలుసా... అనుష్క, సమంతల కంటే తక్కువేమి కాదు..

    |

    సినిమా ప్రపంచంలో గ్లామర్ తో ఆకట్టుకునే హీరోయిన్స్ సంఖ్య చాలానే ఉంది. అయితే అందం ప్లస్ నటనతో ఆకట్టుకునే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇక గ్లామర్ జోలికి పెద్దగా వెళ్లకుండా కేవలం నటనతో ఆకట్టుకునే సాయి పల్లవి ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ బ్యూటీకి సంబంధించిన ఆదాయంపై ఒక లుక్కేస్తే దాదాపు ఆమె సీనియర్లు అయిన అనుష్క, సమంత రేంజ్ లోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

    మొదటి సినిమాతోనే

    మొదటి సినిమాతోనే

    సాయి పల్లవి తన మొదటి సినిమాతోనే భాషతో సంబంధం లేకుండా అందరిని ఆకట్టుకుంది. ప్రేమమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అనంతరం ఆఫర్స్ కుప్పలుగా వచ్చినా కూడా స్టడీస్ కోసం చాలా వరకు రిజెక్ట్ చేసింది. మెడిసిన్ డిగ్రీ కోసం బిజీగా ఉన్న సమయంలోనే ఫిదా ఆఫర్ వచ్చింది.

    బాక్సాఫీస్ హీరోలకు తక్కువేమి కాదని

    బాక్సాఫీస్ హీరోలకు తక్కువేమి కాదని

    శేఖర్ కమ్ముల అనే ఒకే ఒక్క కారణంతోనే సాయి పల్లవి సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇక ఆ సినిమా తరువాత ఆమె బాక్సాఫీస్ హీరోలకు తక్కువేమి కాదని అర్థమైపోయింది. ఒక్కసారిగా రేంజ్ పెరగడంతో ఆఫర్లు కూడా గట్టిగానే వచ్చాయి. ఇక మెడిసిన్ డిగ్రీ పూర్తి చేశాక అమ్మడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు సైతం చేసింది.

    రెమ్యునరేషన్ ఎంతంటే..?

    రెమ్యునరేషన్ ఎంతంటే..?

    మలయాళం అమ్మాయి అయినప్పటికీ సాయి పల్లవిని తమిళ్ జనాలు కూడా ఎంతగానో ఆదరించారు. కానీ అక్కడ ఇంతవరకు సరైన సక్సెస్ రాలేదు. అయినా కూడా ఆఫర్స్ తగ్గడం లేదు. ఇక ఆమె రెమ్యునరేషన్ 2018లోనే దాదాపు రూ 1.5 కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం.

    ఫోర్బ్స్ టాప్ 30

    ఫోర్బ్స్ టాప్ 30

    2020 ఫోర్బ్స్ టాప్ 30 నటిమణుల్లో సాయి పల్లవి పేరు కూడా వచ్చింది. ఆమె నెట్ వర్త్ వాల్యూ $ 3.5మిలియన్ అని అందులో పేర్కొన్నారు. అంటే దాదాపు సమంత, అనుష్క, వంటి స్టార్ హీరోయిన్స్ రేంజ్ లోనే ఫిదా బ్యూటీ భారీ ఆదాయాన్ని అందుకుంటోంది.

    Recommended Video

    Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
    డబ్బుకు ఆశ పడకుండా..

    డబ్బుకు ఆశ పడకుండా..

    నిజానికి ఆమె రిజెక్ట్ చేసిన పెద్ద సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ సినిమాలు కూడా చేసి ఉంటే సంపాదనలో ఆమెను కొట్టే హోరోయిన్స్ ఉండరు. పైగా యాడ్స్ కూడా చేయదు. అలా చేసి ఉంటే ఉహాలకందని డబ్బు వచ్చి ఉండేది. ఏడాదికి మినిమమ్ రెండు మూడు సినిమాలు చేస్తూనే ఉంది. సాయి పల్లవి డబ్బు కంటే కూడా తన భావాలకు ఎక్కువగా వాల్యూ ఇస్తుందని ఇప్పటికే అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.

    English summary
    Needless to say, Sai Pallavi, who impresses with her performance without going big on glamor, gets craze in any range. And if you take a look at the revenue related to that beauty, it seems that almost all her seniors Anushka and Samantha are earning in the range..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X