సీక్రెట్‌గా సినిమాకు వెళ్లిన సాయి పల్లవి.. ఆ హీరో మూవీకి వెళ్లి అలా దొరిపోవడంతో షాక్!

మలయాళీ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పాలి. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా వరుస విజయాలు వరిస్తున్నాయి.. అయితే ఈ బ్యూటీ ఇటీవల మరోసారి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా సినిమాకు వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకీ ఆమె ఏ హీరో సినిమాకు వెళ్ళింది అనే వివరాల్లోకి వెళితే..

సాధారణ అమ్మాయిలా..

సాధారణ అమ్మాయిలా..

స్టార్ హీరోయిన్ గా ఆమెకు ఎంత గుర్తింపు వచ్చినా కూడా చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. సాయిపల్లవి అంటే మరొక నేచురల్ స్టార్ అనే చెప్పాలి. ఆమె రెమ్యునరేషన్ స్థాయి పెరిగినా కూడా ఆ హోదా విషయంలో మాత్రం చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. తనకంటే తక్కువ రేంజ్ ఆర్టిస్టులను కూడా ఆమె ప్రత్యేకంగా గౌరవిస్తుంది సెట్స్ లో అయితే సాయి పల్లవి హీరోయిన్ తరహాలో కాకుండా ఒక సాధారణ అమ్మాయి లానే కనిపిస్తుంది అని ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు.

నచ్చిన పాత్రలు మాత్రమే..

నచ్చిన పాత్రలు మాత్రమే..

నటనకు ఎంతగానో గౌరవం ఇచ్చే సాయిపల్లవి ఎప్పుడు కూడా ఆడియన్స్ అసహ్యించుకునే పాత్రలను మాత్రం చేసింది లేదు. కేవలం తనకు నచ్చిన పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందులో వల్గారిటీ లేకుండా గ్లామర్ డోస్ లేకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అంతేకాకుండా పాత్రలో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా కూడా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది.

వరుస విజయాలు

వరుస విజయాలు

గత ఏడాదిలో సాయిపల్లవి బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను చూసిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఒంటరిగా..

ఒంటరిగా..

అయితే సాయి పల్లవి అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా కొన్ని సినిమాలను కూడా చూసి వస్తూ ఉంటుంది. ఆమె చాలా సింపుల్ గా తన లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. అందుకే ఫేస్ కనిపించకుండా మాస్క్ తో కవర్ చేసుకుంటూ బయటి ప్రపంచంలో స్వేచ్ఛగా తిరిగేస్తూ ఉంటుంది. ఇదివరకే ఆమె పెద్ద హీరోల సినిమాలను కూడా అలానే చూసింది. శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా నార్మల్ గా ఆడియన్స్ తో ఒంటరిగా చూసింది.

వీడియో వైరల్

వీడియో వైరల్

ఇక సాయి పల్లవి రీసెంట్ గా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాను కూడా ప్రత్యేకంగా వీక్షించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఒక వీడియో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో మరింత షేర్ చేస్తూ సాయి సాయి పల్లవి నిజంగా చాలా నేచురల్ అమ్మాయని పొగడ్తలతో ప్రశంసిస్తున్నారు.

ఎలాంటి హడావుడి లేకుండా

ఎలాంటి హడావుడి లేకుండా

సాధారణంగా ఈ రోజుల్లో ఏ హీరోయిన్ అయినా సరే నలుగురు చూసే విధంగా గా హైలెట్ అవ్వాలి అని సినిమాలకి వెళుతూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా స్వేచ్ఛగా అనుభవించాలని ఇలా సింపుల్ ట్రిక్ తో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ బ్యూటీ నటించిన విరాటపర్వం సినిమా జూలై 1వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X