Agent హాస్పిటల్‌లో సురేందర్ రెడ్డి దారుణ పరిస్థితి తెలిసిన తర్వాత.. సాక్షి వైద్య ఎమోషనల్
హాస్పిటల్‌లో సురేందర్ రెడ్డి దారుణ పరిస్థితి తెలిసిన తర్వాత.. సాక్షి వైద్య ఎమోషనల్
ఏజెంట్ సినిమా నాకు తొలి సినిమా. నా పాత్ర పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. తొలి సినిమా చేసే నాకు ఈ సినిమా ఫ్లాట్‌ఫామ్. ఆరంభంలో సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రోత్సహించిన తీరుతో నాపై నాకు నమ్మకం కలిగింది. యాక్షన్ సీన్లు ఉన్నాయి కానీ.. నేను యాక్షన్ సీన్లలో నేను ఉండను అని సాక్షి తెలిపారు. ఏజెంట్ సినిమా హీరోయిన్ ఇంకా పలు విషయాలను వెల్లడిస్తూ..
కరోనా వైరస్ బారిన పడి సురేందర్ రెడ్డి హాస్పిటల్‌లో చేరినప్పుడు నా మైండ్‌లో వచ్చిన మొదటి ఆలోచన.. ఈ సినిమా మరింత లేటు అవుతుందని. కానీ సురేందర్ డెడికేషన్ చూస్తే నాకు షాక్ అనిపించింది. కొన్ని నెలలు రెస్ట్ తీసుకోమని చెబితే.. ఆయన వీల్ చైర్‌లో కూర్చొని సెట్‌లో షూటింగ్ చేయించారు. అప్పుడు సురేందర్ రెడ్డి డెడికేషన్ చూసి మరింత రెస్పెక్ట్ పెరిగింది అని సాక్షి వైద్య చెప్పారు.

ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి రా చీఫ్‌గా నటిస్తున్నారు. ఆయనతో నాకు కాంబినేషన్ సీన్లు లేవు. అలాగే డీనో మారియాతో కూడా యాక్షన్ సీన్లు లేవు. నాకు మురళీ శర్మ, అను మామ్‌తో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. నాకు మురళీ శర్మతో మంచి అనుబంధం ఏర్పడింది. మురళీ శర్మ సార్ భార్య మరాఠీ కావడంతో మా ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది అని సాక్షి వైద్య తెలిపారు
నిర్మాత అనిల్ సుంకర గారితో నేను ఒక్కసారి మాత్రమే కలిశాను. ఆయన అమెరికాలోని డలాస్‌లో ఉండేవారు. ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ మొత్తం షూటింగ్ ఏర్పాట్లు చూసుకొనేది. చాలా మంది ప్రొడక్షన్ టీమ్ మాతో ఉండేవారు. కిషోర్ గారు అంతా చూసుకొనే వాళ్లు. ప్రొడక్షన్ టీమ్‌లో చాలా మంచి వాళ్లు ఉన్నారు. షూటింగ్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా జరిగిపోయాయి.
ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. మాస్, భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. వావ్ అనే మూమెంట్స్ ఉంటాయి. నా ఫెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్, అఖిల్ అక్కినేని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తాయి. వీటన్నిటి కోసం ఈ సినిమా చూడాలి అని సాక్షి వైద్య చెప్పారు.


Click it and Unblock the Notifications











