Samantha ఆ దర్శకుడితో సమంత రొమాన్స్... వైరల్‌గా మారిన వీడియో
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్‌గా బడా హీరోయిన్గా కెరీర్లో రాణిస్తోంది. అయితే ఈ భామకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఈమె ఓ దర్శకుడితో రొమాన్స్ చేస్తూ కనిపించింది. అది చూసిన నెటిజన్లంతా ఇది ఎపుడూ జరిగిందంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. దాని గురించి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
వీడియో వైరల్...
సమంత ఈ పేరు సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఏమాయ చేసావే అనే సినిమాతో వచ్చి కుర్రాళ్ల మనసు దోచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ యూత్‌ను ఫిదా చేస్తూనే ఉంది. పదేళ్లకుపైగా నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కెరీర్లో టాప్ పొజిషనల్లో ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఏమాయ చేశావే తొలి సినిమా అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది కాదని తెలిసింది. ఆమె తన మొదటి సినిమాను నాగ చైతన్యతో కాకుండా రాహుల్ రవీంద్రన్తో చేసిందట.

సమంత రొమాన్స్...
ఈ ఇద్దరు కలిసి మాస్కోవిన్ కావేరీ అనే సినిమాలో నటించారు. ఇప్పుడీ సినిమలోని పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో రాహుల్ - సమంత బీచ్‌లో చిందులేస్తూ, రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూసిన సామ్ అభిమానులు, నెటిజన్లు తెగ షాక్ అవుతున్నారు. ఇది ఎప్పుడు చేశారంటూ నోరెళ్లబెడుతున్నారు. ఆ సాంగ్ గురించి తెగ ఆరా తీస్తున్నారు.
మాస్కోవిన్ చిత్రం...
వాస్తవానికి 2007లో ఈ మాస్కోవిన్ సినిమాను తెరకెక్కించారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో సినిమా రిలీజ్ బాగా లేట్ అయిందట. దీంతో ఏమాయ చేశావే ముందు రిలీజ్ అయింది. ఆ తర్వాత మాస్కోవిన్ చిత్రం వచ్చినట్టు కూడా తెలీదు. ఆ సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు.

ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్...
ఇక రవీంద్ర భార్య సింగర్ చిన్మయి కూడా సమంతకు మంచి స్నేహితురాలు. ఖాళీ దొరికినప్పుడల్లా వీరిద్దరూ కలిసి సంతోషంగా గడుపుతుంటారు. పైగా చిన్మయినే సమంతకు చాలా సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆమె పాత్రకు ఓ అందాన్ని తీసుకొచ్చింది. సమంత విజయానికి ఎంతో దోహదం చేసింది. అలా సమంత అంటే చిన్మయి, చిన్మయి అంటే సమంతలా మారిపోయింది.
సమంత సిటాడెల్
కాగా, సమంత సినిమాల విషయానికొస్తే చివరిగా ఖుషీ చిత్రంలో నటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉంది. మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్‌ను జాయ్ ఫుల్‌గా గడుపుతోంది. త్వరలోనే సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇక అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్.. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత దర్శకుడిగా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇతర హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











